సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా కష్టం. టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరు ముద్దుగుమ్మలు ఇలా సినిమాల్లో మెరిసి అలా దూరం అవుతూ ఉంటారు. టాలీవుడ్ లో ఇలా చాలా మంది హీరోయిన్లు అలా మెరిసి ఇలా మాయమయ్యారు. కొందరు అవకాశాలు రావడంతో సినిమా పరిశ్రమలో మెరిస్తే మరికొందరు వేరే రంగాల్లో స్దిరపడ్డారు. ఇంకొందరు వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఓ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
చిన్నచిన్న పాత్రలు చేస్తూ పెద్ద అవకాశాలు అందిపుచ్చుకుంది. టాలీవుడ్ లో బిజీ నటిగా మారిపోయింది.
తన అంద చందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ ముద్దుగుమ్మ ఒక్కోసారి తాను స్మశానానికి వెళ్తాను అనే మాట చెప్పి షాకిచ్చింది.
కామాక్షి భాస్కర్ల ఈమె పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరేమోకాని ఆమె చేసిన సినిమాలు చెబితే వెంటనే గుర్తు వస్తుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కొంతకాలం అపోలో ఆస్పత్రిలో డాకర్ట్ గా చేసింది. సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో డాక్టర్ గా కొనసాగుతూ సినిమా ప్రయత్నాలు చేసింది. 2019లో ఆమెకి ప్రియురాలు సినిమాతో అవకాశం వచ్చింది. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇక ఆమె లైమ్ లైట్ లోకి వచ్చింది మాత్రం పొలిమేర సినిమాతో. 2021లో విడుదలైన మా ఊరి పొలిమేర సినిమా ఆమెకి మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత పొలిమేర 2 లో ఆమె మరింత పేరు పొందింది. ఇందులో లక్ష్మీ పాత్రలో తన నటనతో కట్టిపడేసింది.
2024లో ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది. 12 ఎ రైల్వే కాలనీ అనే సినిమాతో తాజాగా ఆమె మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, తనకు ఏదైనా నిరాశ కలిగినా, మనశ్శాంతి ప్రశాంతత కావాలి అనిపించినా కచ్చితంగా తాను స్మశానానికి వెళతాను అని తెలిపింది. ఇలా చేయడం వల్ల నాలో పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది అని తెలిపింది. ఇక ఆమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

