రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పిన
శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి.
డిస్కో శాంతి పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో తన డ్యాన్స్ తో నటనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్నాక సినిమాలకు దూరం అయ్యారు. బావ అంటూ శ్రీహారిని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఎంతో ప్రేమతో చూసుకునేవారు. కానీ శ్రీహరి మరణించిన తర్వాత ఆమె పెద్దగా సినిమా పరిశ్రమలో బయట కూడా కనిపించడం లేదు. ఆమె పెద్ద కుమారుడు సినిమా రంగ ప్రవేశం జరిగింది.
అయితే డిస్కోశాంతి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పారు. అదేంటి ఆమె రామ్ చరణ్ కి క్షమాపణలు చెప్పడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. దీని వెనుక ఓ స్టోరీ ఉంది. అది కూడా ఆమె తెలియచేశారు. గతంలో రామ్ చరణ్ మగధీర సినిమా చేశారు. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఓ చరిత్ర క్రియేట్ చేసింది.అప్పటి వరకూ ఉన్న వసూళ్ల రికార్డులు అన్నీ తిరగరాసింది. రాజమౌళి సినిమాల ట్రెండ్ లో ఓ మైలురాయిగా నిలిచింది.
ఈ సినిమాలో మరో కీలక పాత్ర శ్రీహరి చేశారు. చెప్పాలంటే కథను మలుపు తిప్పే పాత్ర ఆయనది. అయితే ముందు శ్రీహారి ఇంటికి వచ్చిన సమయంలో ఇలా రాజమౌళి సినిమాలో ఓ అతిధి పాత్ర చేస్తున్నా అని చెప్పారట. వెంటనే డిస్కోశాంతి ఈ సినిమాలో నువ్వు నటించవద్దు, బావ, నువ్వు రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చెయ్ ఇలాంటి పాత్ర వద్దు అన్నారట. అయితే ఆ స్టోరీగాని ఏమీ కాని ఆమెకి అప్పటికి తెలియవట. ఇలా అన్నందుకు రామ్ చరణ్ క్షమించాలి అని కోరారు. అయితే తర్వాత సినిమా చూశాక చాలా బాగా నచ్చింది. చరణ్ నటన శ్రీహారి పాత్ర, ముఖ్యంగా సినిమాని మలుపు తిప్పే పాత్ర ఇది చూసి నేను ఆరోజు అనవసరంగా ఆ మాట అన్నాను అని బాధపడ్డారట.
శ్రీహరి కుమారుడు మేఘాంశ్ టాలీవుడ్‌లోకి రాజ్ దూత్ సినిమాలో హీరోగా అడుగుపెట్టారు.
2019 జూలైలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఒక రోడ్ త్రిల్లర్ కథతో వచ్చింది. గతంలో తన తండ్రి నటించిన బైరవ సినిమాలో బాలనటుడిగా కూడా మేఘాంశ్ నటించారు. ఇక తాజాగా కొత్త సినిమా ఆస్మాన్. ఈ సినిమా ఇటీవల ప్రారంభంమైంది. ఈ చిత్రానికి రామ్ నందన్ డైరెక్షన్ చేస్తున్నారు.ఒక మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రానుంది.

