తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద పండుగ అంటే మహానాడు అనే చెప్పాలి. పెద్ద ఎత్తున లక్షలాది మంది టీడీపీ అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఈ మహానాడుకి హాజరవుతారు. అలాంటి మహానాడు ఈసారి ఎక్కడ జరుగనుంది అనేది చూస్తే శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్నారు. సుమారు ఈసారి 4 లక్షల మంది తెలుగుదేశం కుటుంబం హాజరుఅవుతారు అని అంచనా. దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు నాయకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రాని తాము అశ్రద్ద చేయడం లేదు, అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నాం అని ఈ సభ ద్వారా తెలియ చేయనున్నారు అలాగే ఉత్తరాంధ్రాలో ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది, మిగిలిన జిల్లాల్లో కంటే ఓటర్లు ఇక్కడ పెరిగారు, ముఖ్యంగా మహిళా ఓటర్ల సంఖ్య స్టేట్ లో ఇక్కడ ఎక్కువగా పెరిగారు ఇవన్నీ కూడా టీడీపీ ఆలోచించింది. ఇది ఒక ప్రధాన కారణం.
అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రా ప్రాంతం అభివృద్ది చేస్తామని పదే పదే చెబుతుంది. ప్రాజెక్టులు కంపెనీలు అలాగే వస్తున్నాయి. ఇక భోగాపురం ఎయిర్ పోర్ట్ , శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ వైద్య శాలల ఏర్పాటు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతం పై తమకు ఉన్న ప్రేమని తెలియచేస్తున్నాయి. విశాఖలోని డేటా కేంద్రాలు ఐటీ అభివృద్ది కూడా పార్టీ ప్రజలకు తెలియచేయనుంది.
ఇక యువత ఇక్కడ ఎక్కువ ఉన్నారు, వారిని తెలుగుదేశం ఆకట్టుకుంటోంది. ఇక్కడే ఈ పెద్ద పండుగ చేయడానికి ఇది కూడా ప్రధాన కారణం. ఇక ప్రతీ ఏడాది ప్రాంతాలు మారుస్తున్నారు, గత ఏడాది రాయలసీమలో చేశారు, ఈసారి శ్రీకాకుళంలో నిర్వహించి వచ్చే ఏడాది గుంటూరు, ఆ తర్వాత గోదావరి జిల్లాలు లేదా అనంతపురంలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
మహానాడు కోసం అనేక స్ధలాలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలో పంచాయతీగా ఉన్న చాపురం ఇప్పటికే పరిశీలించారు. ఇది హైవేకి ఆనుకున్న ప్రాంతం పెద్ద సభాస్దలికి సరిపోయే ప్రాంతం అని గుర్తించారు. దీనితో పాటు పైడిభీమవరం, ఎచ్చెర్ల, కూడా పరిశీలించారు. త్వరలో సభాస్ధలిపై క్లారిటీ రానుంది.

