రాజకీయాల్లో ఓర్పు సహనం చాలా ముఖ్యం. ఏపీలో ఇటీవల రాజకీయాల్లో పిఠాపురం టీడీపీ నేత వర్మ ఎపిసోడ్ చాలా హైలెట్ అయింది. ఇటీవల జనసేన నాయకుడు పెండెం దొరబాబు అలాగే జనసేన నాయకులతో వర్మకు వివాదం జరిగింది. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా వర్మనే కాస్త మందలించింది..ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం పై వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సీరియస్ అయిన చంద్రబాబు లోకేష్ కూడా వర్మ ని కాస్త మందలించారు. కూటమిగా కలిసి ఉన్న పార్టీలో ఇలాంటి విభేదాలు రాకూడదు అని తెలియచేశారు.
అయితే ఈ విషయంలోనే కాదు గతంలో కూడా పిఠాపురం వేదికగా చాలా విభేదాలు బయటపడ్డాయి..వర్మ ప్రశ్నించడం ఇటు జనసేన నాయకులు కూడా పవన్ కల్యాణ్ తో నాగబాబుతో నాదెండ్లతో ఈ విషయం పై మాట్లాడుతూనే ఉన్నారు. చివరకు కూటమిగా ఉన్న పార్టీల మధ్య విభేదాలు రావచ్చు అని చంద్రబాబు ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి వర్మని తొలగించింది టీడీపీ అధిష్టానం. అయితే వర్మ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తానికి ముందు నుంచి హెచ్చరించిన చంద్రబాబు చివరకు ఆయనను పదవి నుంచి తొలగించారు. అయితే పార్టీలో వర్మకు స్ధానం ఉంది, విభేదాలు వైరాలు వచ్చినా కలిసి పనిచేయాలి అని పదే పదే చంద్రబాబు పవన్ కల్యాణ్ చెబుతున్నా, వర్మ వెనక్కి తగ్గడం లేదు. ఈ నిర్ణయం వల్ల మిగిలిన నియోజకవర్గాల్లో కూడా నాయకులకి కనువిప్పు కలుగుతుంది అని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది, రాజకీయ విశ్లేషకుల నుంచి చర్చ జరుగుతోంది.
ఇక్కడ వర్మ తన సీటుని త్యాగం చేసి పవన్ కల్యాణ్ కు ఇవ్వడం జరిగింది, పవన్ కల్యాణ్ గెలుపుకి కూడా వర్మ ఎంతో సహకరించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని అనుకున్నారు. అయితే ఆ పదవి కూడా ఇంకా వర్మకు రాలేదు. వర్మ కూడా ఈ నిర్ణయం పై షాక్ అయ్యారు. తను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా ఇలాంటి నిర్ణయం రావడం ఏమిటా అని ఆశ్చర్యపోయారు.
అయితే ఇది టీడీపీ లోనే కాదు జనసేలో కూడా జరగవచ్చు, కూటమిలో ఉన్న మూడు పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, విభేదాలు ఉన్నా బయటకు కాకుండా పార్టీ అంతర్గతంగా చర్చించుకుని వివాదానికి ముగింపు పలకాలి అని తెలియచేస్తున్నారు. సో ఇక్కడ పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది ముందు ఒక కమిటి ఏర్పాటు చేయనున్నారు. సో మొత్తానికి పవన్ కల్యాణ్ కు కూడా రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పొత్తు ధర్మానికి నష్టం కలగకూడదు అని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు మేధావి వర్గం. సో వర్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

