దేశంలో ఇటీవల నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే అందరూ ఇప్పుడు తమిళనాడు విజయం తర్వాత బెంగాల్ విజయం గురించి మాట్లాడుకుంటున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండే వెస్ట్ బెంగాల్ మమత వచ్చిన తర్వాత తృణముల్ కాంగ్రెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలాంటి చోట 200 స్ధానాలకు పైగా గెలుచుకుని బీజేపీ జెండా పాతింది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో తొలిసారి బీజేపీ జెండా ఎగురవేసింది. ఇప్పటి వరకూ సింగిల్ డిజిట్ కు పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు త్రిఫుల్ డిజిట్ కు చేరింది.
అయితే ఈ విజయం కచ్చితంగా అక్కడ పార్టీని ముందుకు నడిపించిన బీజేపీ నాయకుడు సువేందు అధికారి కృషి అనే చెప్పాలి, మరో పక్క మమత అతనిని ఎందుకు వదలుకుంది అని చాలా మంది బాధపడుతున్నారు. ఆమె దగ్గర ఎదిగిన నాయకుడు ఇప్పుడు ఆమెని ఓటమి అంచున చేర్చాడు. ఇక వెస్ట్ బెంగాల్ విజయం పై ప్రధాని నరేంద్ర మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి.
ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలపై మోదీని ట్రంప్ అభినందించారు. మోదీలాంటి నాయకుడు దొరకడం భారత్ చాలా లక్కీ అంటున్నారు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి మూడు ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ విజయం సాధిస్తే ,తమిళనాడు టీవీకే విజయ్ పార్టీ విక్టరీ సాధించింది. ఇక ట్రంప్ ఈ విధంగా ప్రశంసించడం పై బీజేపీ శ్రేణులు కూడా ఆనందంలో ఉన్నారు.
ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో రూరల్ ఏరియాల్లో బీజేపీ గతంలో వెళ్లేది కాదు, తృణమూల్ అడ్డాగా ఆ ప్రాంతాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి రూరల్ ఏరియాల్లోకి వెళ్లి పార్టీ కేడర్ నిలబడ్డారు. ఇదంతా బీజేపీకి కలిసి వచ్చింది. ఇక మోదీ కూడా ఈ విజయం పై మాట్లాడుతూ, ఈ వెస్ట్ బెంగాల్ విజయం చాలా స్పెషల్, రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి నాంది అన్నారు.
ఇక ప్రపంచ మీడియా సంస్దలు కూడా దీనిపై స్పందించాయి. బ్రిటన్, టర్కీ, ఇవన్నీ కూడా నరేంద్రమోదీ చతురత ఆయనపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు అని తెలిపారు.

