Homeజాతీయకేర‌ళ‌లో విజ‌య‌న్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏమిటి

కేర‌ళ‌లో విజ‌య‌న్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏమిటి

కేర‌ళ‌లో విజ‌య‌న్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏమిటి

కేర‌ళ‌లో త‌మ‌కు తిరుగులేదు అనుకున్న LDF కూటమికి బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా వ‌చ్చిన ఎన్నిక‌ల ఫలితాల్లో LDF ఓడిపోయింది. విజ‌యన్ గెలిచినా ఆయ‌న పార్టీ నేత‌లు మంత్రులు ఓట‌మిపాల‌య్యారు. కంచుకోట‌గా కేర‌ళ‌లో తిరుగులేని శ‌క్తిగా ఉన్న విజ‌య‌న్ కు ఇలాంటి ప‌రిస్దితి ఎందుకు వ‌చ్చింది? ఎల్ డీఎఫ్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఇప్పుడు చూద్దాం?

1. ప‌ది సంవ‌త్స‌రాలుగా విజ‌య‌న్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు, దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు భారీగా పోల్ అయింది.

2. విజ‌య‌న్ వేగంగా నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డం రాజ‌కీయ స్వార్ధం పెరిగింది అనే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి.

3. పేద‌లు మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు ఈ ప‌ది సంవ‌త్స‌రాల్లో ఎల్ డీ ఎఫ్ చేసింది ఏమీ లేదు. ఇది కూడా నెగిటీవ్ ఓటు బ్యాంకుగా మారింది. నిరుద్యోగం బాగా పెరిగింది యువ‌త‌కు కూడా విజ‌య‌న్ పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది.

4. ఇక కొత్త ప్ర‌భుత్వానికి ప‌గ్గాలు ఇవ్వాలి అని ప్ర‌జ‌లు భావించారు అందుకే ఈ ఎన్నిక‌ల్లో UDF 102 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది.

5. ఇక ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు, ఇటు కేబినెట్ లో కూడా కొన్ని చ‌ర్చ లేకుండానే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం నిరంకుశంగా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

6. విజ‌య‌న్ ప్ర‌భుత్వం పై గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాలుగా అవినీతి ఆరోప‌ణ‌లు ఎన్నో వ‌చ్చాయి, బంధుప్రీతి వ‌ల్ల ఆయ‌న ఎన్నో విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. చాలా స్కాముల్లో ప్ర‌భుత్వ పెద్ద‌ల పేర్లు వినిపించాయి. ఇవ‌న్నీ కూడా కాంగ్రెస్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లింది.

7. విజ‌య‌న్ పై ఎంత వ్య‌తిరేక‌త ఉంది అంటే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ధర్మడంలో గెలిచినప్పటికీ, గ‌తంలో కంటే స‌గం మెజార్టీ త‌గ్గిపోయింది. 50 నుంచి 60 వేల మెజార్టీ వ‌చ్చేది ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 19 వేల‌కు ప‌డిపోయింది.

8. ఇక ఎన్న‌డూ లేని విధంగా ఆయ‌న కేబినెట్ పై తీవ్ర విమర్శ‌లు స్కామ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి, వారిపై చ‌ర్య‌లు తీసుకోలేదు కేబినెట్‌లోని 21 మంది మంత్రులలో 13 మంది ఓడిపోయారు.

9.కన్నూర్ వంటి కమ్యూనిస్ట్ కంచుకోటల్లో కూడా పార్టీ అసమ్మతి నేతలు స్వ‌తంత్య్రంగా గెలిచారు. సో కేడ‌ర్ కూడా ఎలా దూరం అయిందో అర్దం చేసుకోవ‌చ్చు.

10. ఎల్ డీఎఫ్ కు ఎప్పుడూ మైనార్టీ వ‌ర్గాలు స‌పోర్ట్ గా ఉండేవి, కానీ ఆ మైనార్టీ వ‌ర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు నిలిచాయి ఇలా క‌మ్యూనిస్ట్ కంచుకోట కూలిపోయింది.

ఇక వ‌చ్చేఎన్నిక‌ల నాటికి విజ‌య‌న్ స్ధానంలో యువ నాయ‌క‌త్వం వ‌స్తే, కేర‌ళలో మ‌ళ్లీ ఎల్ డీఎఫ్ కు పున‌రుత్తేజం వ‌స్తుంది అంటున్నారు అన‌లిస్టులు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments