మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. అనేక రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ మొత్తానికి జూన్ 4 వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో సమ్మర్ సెలవులు వారంలో ముగుస్తాయి అనగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇది కూడా మంచి బిజినెస్ టైమ్ అనే అంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాకి దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది, ఇక కేవలం ఎడిటింగ్ వర్క్ సీజీ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఇటీవల ఓ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి చూస్తే మే నెల చివరిన ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ట్రైలర్ గురించి చూస్తే మే నెల 18 లేదా 19 న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట. అంతేకాకుండా ట్రైలర్ రిలీజ్ కూడా భారీ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఇక దేశ వ్యాప్తంగా అన్నీ ప్రముఖ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అందుకే పెద్ద ఎత్తున సినిమా ప్రమోట్ చేయాలి అని చూస్తున్నారు మేకర్స్.
ఇక నటీనటులు గురించి చూస్తే
ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో
జాన్వీ కపూర్ హీరోయిన్
అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు
జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు
దివ్యేందు శర్మ, బాలీవుడ్ నటుడు ఇందులో పాత్ర చేస్తున్నారు
బొమ్మన్ ఇరానీ ముఖ్య పాత్ర చేస్తున్నారు
ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ రానుంది. ఇందులో కుస్తీ కబడ్డీ క్రీడల్లో నైపుణ్యం ఉన్న గ్రామీణ యువకుడిగా చరణ్ నటిస్తున్నారు. ఇక చిత్రానికి ఎంత ఖర్చు అయినా చేసేందుకు వెనుకాడటం లేదు నిర్మాణ సంస్దలు.
వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
.రంగస్ధలం మించి ఈ సినిమాలో ఆయన నటన ఉంటుంది అంటున్నారు అభిమానులు చిత్ర యూనిట్ ..భారీ రెజిల్లింగ్ సీక్వెన్స్ కోసం ఏకంగా మూడు నెలల సమయం తీసుకున్నారట, అంతేకాదు సినిమాలో ఇదే హైలెట్ గా నిలవనుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

