ఇరాన్ అమెరికాతో పోలిస్తే చిన్నదేశం, అయినా పంతాలు పట్టింపుల్లో అమెరికాని మించిపోయింది. అమెరికా పెడుతున్న షరతులకి ఒకే చెప్పడం లేదు ఇరాన్. దీంతో మిగిలిన దేశాలు కూడా ఈ రెండు దేశాల వల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఇజ్రాయెల్ సైడ్ అయిపోయి ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్దంగా ఇది మారిపోయింది. అయితే అమెరికా పెడుతున్న కండిషన్లలో, ఇరాన్ కి అస్సలు నచ్చనిది అణు ఒప్పందం. పాకిస్దాన్ కేంద్రంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇరాన్ అమెరికా కండిషన్లకు ఒప్పుకోకపోవడంతో అమెరికా నేతలు పాకిస్దాన్ నుంచి వెళ్లిపోయారు.
ఇరాన్ తనకు తాను స్వతంత్రంగా యుద్దం వస్తే శత్రువులకి ధీటుగా సమాధానం చెప్పాలి అని భావిస్తోంది. అందుకే అణుశక్తిని దేశంలో రక్షణ వ్యవస్ధలో కీలకం అయ్యేలా తమ శక్తిని పెంచుకుంటోంది. ఏ దేశానికి తాము తలొగ్గేది లేదని తెలియచేస్తోంది.అయితే ఇరాన్ యురేనియం శుద్ది ఆపివేయాలి అని అమెరికా డిమాండ్ చేస్తోంది. ప్రధానంగా ఈ విషయంలో రెండు దేశాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ట్రంప్ కూడా పదే పదే ఈ విషయంలోనే వార్నింగ్ ఇస్తున్నారు.
ఇక హర్ముజ్ జలసంధి తన ఆధీనంలో ఉండాలి అని ఇరాన్ భావిస్తోంది. మా భూభాగం పై మీ పెత్తనం ఏమిటి అని అమెరికాని ప్రశ్నిస్తోంది. ఇది అంతర్జాతీయ జలభాగం కేవలం మీ సొత్తు కాదు దీనిలో అందరికి హక్కు ఉంది అంటూ అమెరికా కొత్త ప్రశ్న లేవనెత్తుతోంది. హర్ముజ్ మూసివేయడంతో ఇరాన్ పై మిగిలిన దేశాలు కూడా సీరియస్ అవుతున్నాయి. ఇది కూడా ఇద్దరి మధ్య సయోధ్యకు అడ్డంకిగా ఉంది.
ఇరాన్ పై ఉన్న ఆంక్షలు అన్నీ తొలగించాలి అని అమెరికా ముందు, ఇరాన్ ప్రతిపాదన చేసింది. తమ దేశం పై దాడులు చేయడం బేస్ లు నాశనం చేయడం వల్ల దేశానికి జరిగిన నష్టానికి ఆర్దికంగా నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది. కానీ ఇరాన్ మా షరుతులు ఒకే అంటే దానికి సిద్దం అంటోంది అమెరికా.
ఇరాన్ తమ దేశానికి దగ్గరగా ఉన్న కొన్ని దేశాల్లో సాయుధ గ్రూపులకి సాయం చేస్తోంది. వారికి సాయం ఆపివేయాలి అని అమెరికా కోరుతోంది. ఇరాన్ మాత్రం ఇది తమ దేశ సార్వభౌమాదికారం దీనిలో మీ జోక్యం వద్దు అని అమెరికాని హెచ్చరిస్తోంది.
ఇక ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఒక్కశాతం కూడా అణుకార్యక్రమాలు చేయకూడదు యురేనియం శుద్ది ప్రక్రియ ఆపివేయాలి అని డిమాండ్ చేస్తోంది.
అయితే తమ దేశం పై దాడి చేసి తమ అధినేతను పొట్టనపెట్టుకుని మళ్లీ మాకు షరతులు విధించడం ఏమిటి అంటూ ఇరాన్ అమెరికాని ప్రశ్నిస్తోంది. సో శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా లేవు, అయితే మిగిలిన దేశాలు మాత్రం ఈ మూడు దేశాల చర్యల వల్ల నష్టపోతున్నాయి, ఓ పక్క స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటే, బంగారం రేట్ డౌన్ అవుతోంది, ఇక భారీగా నౌకలు నిలిచిపోతున్నాయి, ఆయిల్ కంపెనీలు వ్యాపారులు, రిఫైనరీలు నష్టపోతున్నాయి, వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోతున్నాయి.
మరి ఈ రెండు దేశాల చర్చలు ఎప్పుడు తుది దశకు వస్తాయో చూడాలి. ప్రస్తుతానికి కాల్పుల విరణమ ఒప్పందం కొనసాగుతోంది. ఇది శాశ్వత కాల్పుల ఒప్పందంగా ఉండాలి అనేది అందరి కోరిక.

