పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల రాశీఖన్నాఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు ఈ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల తేది ప్రకటన వచ్చేసింది. ఈ నెల 19వ తేదిన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ బిజినెస్ ఓటీటీ డీల్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. విడుదలకు ముందు ఓవర్సీస్ లో రికార్డులు కొల్లగొడుతోంది పవన్ సినిమా.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అసలైన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈగ్లింప్స్ పవన్ అభిమానులకి ఎంతగానో నచ్చింది. చెప్పాలంటే హరీష్ శంకర్ ఈ చిన్న గ్లింప్స్ తో చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఓ హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది విడుదలకు ముందు. ఎందుకంటే ఇంకా రిలీజ్ కు పది రోజులు డేట్ ఉండటంతో నార్త అమెరికాలో ఈ సినిమాకి ప్రీమియర్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా 50 వేల డాలర్ల మార్క్ అందుకుంది. ఇది కేవలం 9 గంటల వ్యవధిలోనే అందుకోవడం ఓ రికార్డు అనే చెప్పాలి. సినీ వర్గాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత భారీ వసూళ్లు సాధిస్తుంది అంటున్నాయి. ఇక సినిమా విడుదల తర్వాత మరింత పాజిటీవ్ టాక్ వస్తే వసూళ్ల పరంగ గత రికార్డులు దాటే అవకాశం ఉంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఓవర్సీస్ బిజినెస్ చూసి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా, అదే జోరు ఇక్కడ కనిపించాలి అని కోరుకుంటున్నారు. మరి ఉస్తాన్ భగత్ సింగ్ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

