Homeజాతీయవిజయ్ జ్యోతిష్యుడికి కీలక పదవి

విజయ్ జ్యోతిష్యుడికి కీలక పదవి

త‌మిళ‌నాడులో టీవీకే ప్ర‌భుత్వం కొలువుదీరింది. సీఎంగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ముఖ్య‌మంత్రి విజ‌య్ త‌న టీమ్ ని సిద్దం చేసుకుంటున్నారు. ప‌రిపాల‌న‌లో అనుభ‌వం ఉన్న అధికారుల‌ని త‌న ద‌గ్గ‌ర నియ‌మించుకుంటున్నారు. చీఫ్ సెక్ర‌ట‌రీ, ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఇలా అంద‌రిని మంచి పేరు ఉన్న అధికారుల‌ని నియ‌మించుకుంటున్నారు. ఇక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కూడా సగం పూర్తి చేస్తున్నారు. త‌న టీమ్ ని పూర్తిగా సిద్దం చేసుకుని పరిపాల‌న‌లో ముందుకు వెళ్ల‌నున్నారు విజ‌య్.

తాజాగా టీవీకే ప్రభుత్వం ఓ కీలక నియామకం చేపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ తన రాజకీయ వ్యవహారాల కోసం ఓఎస్ డీని నియ‌మించుకున్నారు. ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ, త‌న స‌న్నిహితుడు విజ‌య్ కు జ్యోతిష్య స‌ల‌హాలు ఇచ్చే పార్టీ అధికార ప్రతినిధి అయిన, రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ ని ఓఎస్డీగా నియ‌మించుకున్నారు. సీఎస్ ఇప్ప‌టికే ఉత్త‌ర్వులు ఇచ్చారు.

రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ ముఖ్య‌మంత్రి విజ‌య్ కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉంటారు. ప‌రిపాల‌న ప‌రమైన స‌ల‌హాలు రాజ‌కీయ స‌ల‌హాలు ఇస్తారు. త‌న అనుకున్న వారికి న‌మ్మ‌కం ఉన్న వారికి కీల‌క ప‌ద‌వులు ఇస్తున్నారు విజ‌య్. ఈ నియామ‌కం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. విజ‌య్ కు రిక్కీ రాధ‌న్ చాలా కాలంగా స్నేహం ఉంది.

సినిమాల విష‌యంలో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు విష‌యంలో ఎన్నో స‌ల‌హలు తీసుకునేవారు. ఇక విజ‌య్ వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల్లో కూడా ఆయ‌న వెంట ఉంటున్నారు. ముఖ్యంగా పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యం నుంచి ఆయ‌న విజ‌య్ కు ఎంతో సాయంగా నిలిచారు. దీంతో విజ‌య్ త‌న‌ని న‌మ్ముకున్న వారికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు అని చ‌ర్చ న‌డుస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments