Homeజాతీయమ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మికి కార‌ణాలు ఇవే

మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మికి కార‌ణాలు ఇవే

వెస్ట్ బెంగాల్ లో మూడు సార్లు మ‌మ‌త సీఎంగా చేశారు. నాలుగోసారి కూడా తాను క‌చ్చితంగా గెలుస్తాను అని ధీమాగా ఉన్నారు . కానీ ఆమె పార్టీ ఓట‌మిపాలైంది, నాలుగు ఐదుస్ధానాలు ఉండే బీజేపీ ఏకంగా 200 సీట్లు ఇక్క‌డ గెలుచుకుని మ‌మ‌త పార్టీకి ఓ షాక్ ఇచ్చింది. మ‌హిళా నాయ‌కురాలుగా సీఎంగా ఉండి కూడా మ‌హిళ‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోయారు అనే విమ‌ర్శ మ‌మ‌త‌పై ఉంది. మ‌హిళ‌లు చాలా మంది ఈసారి మ‌మ‌త‌కు ఓటు వేయ‌లేదు. ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్నాయి, మ‌రి మ‌మ‌త ఓట‌మికి సంబంధించి కార‌ణాలు ఏమిటి అనేది మ‌నం విశ్లేషిద్దాం.

పశ్చిమబెంగాల్‌లో భారతీయ జనతాపార్టీ 206 స్థానాలు గెలుచుకుంది. పదిహేనేళ్లపాటు నిరంతరాయంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలిచింది.. పశ్చిమ బెంగాల్‌లో 50 శాతానికి పైగా ఉన్న మహిళా ఓటర్లు ఇప్పటివరకు మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉన్నారు. మ‌హిళ‌ల‌కు అలాగే స్కూల్ కాలేజీ విద్యార్దుల‌కి ఆమె అనేక ప‌థ‌కాలు అందించారు వాటిలో ముఖ్యంగా లక్ష్మీ భండార్, కన్యాశ్రీ, సబుజ్ సాథీ ఇలా ఎన్నో ప‌థ‌కాలు ఉన్నాయి. అయితే మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో భ‌ద్ర‌త లేదు అనేది ఈ రెండు మూడు సంవ‌త్స‌రాలుగా ఆమెపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణం అయింది. ప‌లు సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

ఆర్‌జీ కర్ ఉద్యమం ఆమెకి బాగా మైన‌స్ అయింది. ఆ కాలేజీలో డాక్ట‌ర్ పై జ‌రిగిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా మ‌మ‌త‌పై నెగిటీవ్ ఇంపాక్ట్ క‌లిగేలా చేసింది. బీజేపీ పెద్ద అస్త్రంగా దీనిని మ‌ల‌చుకుంది. అంతేకాదు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టీఎంసీ గ‌ట్టి ప‌ట్టు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పనిహాటిలో ఆర్ జీ క‌ర్ బాధితురాలి త‌ల్లికి బీజేపీ టికెట్ ఇవ్వ‌డంతో ఆమె 28 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు..బీజేపీ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కాలేదు రేఖా పాత్రని ఎన్నిక‌ల బ‌రిలో దింపింది. ఇది మ‌మ‌త కూడా ఊహించ‌ని ప‌రిస్దితి.

బీజేపీ ఎన్నిక‌ల హామీలో భాగంగా నెలకి 3000 ఆర్దిక సాయం అని ప్ర‌క‌ట‌న చేసింది, ఇది మ‌హిళ‌ల‌కు ద‌గ్గ‌ర చేసింది

బూత్ లెవ‌ల్ మేనేజ్ మెంట్ మారుమూల గ్రామాల వ‌ర‌కూ నెట్ వ‌ర్క్ విస్త‌రించింది బీజేపీ. ఇది కూడా టీఎంసీ ప‌త‌నానికి కార‌ణం. గ‌తంలో అంత దూరం బీజేపీ గ్రౌండ్ వ‌ర్క్ చేసేది కాదు, ఈసారి మాత్రం అమిత్ షా ప‌క్కా ప్లానింగ్ తో ముందుకు సాగారు.

15 ఏళ్ల పాటు మ‌మ‌త సీఎంగా ఉన్నారు,ఈసారి వేరేవారికి అవ‌కాశం ఇచ్చి చూద్దాం అని చాలా మంది ఓట‌ర్లు భావించారు, ఇదంతా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుగా మ‌ల్లింది.

ఇక మ‌మ‌త‌కు మ‌రింత చేటు తెచ్చిన నిర్ణ‌యం
సర్ ప్రభావం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ సుమారు 90 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను జాబితా నుంచి తొలగించింది కేంద్రం. ఇది మ‌మ‌త పార్టీ ఊహించ‌లేదు, అలాగే ఈ ఎన్నిక‌ల్లో భారీగా దెబ్బ‌తీసింది ఈ నిర్ణ‌యం. నిజ‌మైన ఓట‌ర్ల పేర్లు తొల‌గించారు అని మ‌మ‌త పోరాటం చేస్తే, అధికారులు తిప్పి కొట్టారు ఈ ఆరోప‌ణ‌ల‌ని. చ‌నిపోయిన వారి పేర్లు కూడా పెద్ద ఎత్తున తొల‌గించారు అనేది అధికారులు తెలియ‌చేశారు. ఏళ్లుగా తృణ‌ముల్ ఇలాంటి ఓటు బ్యాంకుతో గెలుస్తోంది అంటూ బీజేపీ కూడా కౌంట‌ర్ ఇచ్చింది.

ఇక టీఎంసీ మూడోసారి అధికారంలోకి రావ‌డంతో నాయ‌కులు అవీనీతి అడ్డు అదుపు లేకుండా పోయింది. అన్ని రంగాల్లో అవినీతి బాగా పెరిగింది ఇలా అనేక కేసులు కూడా రాష్ట్రంలో హైలెట్ అయ్యాయి. ఇక రిక్రూట్మెంట్లు ముఖ్యంగా ఏదైనా నోటిఫికేష‌న్ వ‌స్తే దానికి అప్లై చేయ‌డానికి కూడా కొంద‌రు భ‌య‌ప‌డ్డారు, ఈ పోస్టులు అన్నీ ముందే అమ్మేసుకుంటారు అనే అభ‌ద్ర‌తా భావం కొంద‌రికి ఏర్ప‌డింది. మ‌మ‌త నిరుద్యోగుల విష‌యంలో వారికి చేసింది ఏమీ లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక 2016 టీచ‌ర్స్ రిక్రూట్ మెంట్ కుంభ కోణం ఈ ఎన్నిక‌ల్లో కూడా ఓ మ‌చ్చ‌లాగా వెంటాడింది. సుమారు 25 వేల మంది టీచ‌ర్ల‌ను ఇత‌ర సిబ్బందిని తొల‌గిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఇవ‌న్నీ కూడా ఓట్ల రూపంలో ఆ కుటుంబాలు మ‌మ‌త‌కు దూరం అయ్యాయి.

సిండికేట్ అవినీతి అంటూ ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా 2016-2021 ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌కి ప‌ట్టం క‌ట్టారు ప్ర‌జ‌లు, దానికి కార‌ణం మ‌రో నాయ‌కుడు లేక‌, కానీ ఈసారి సువేందు అధికారి బీజేపీని ముందుకు న‌డిపేందుకు సిద్దంగా ఉన్నాడు, అందుకే సువేందు పై న‌మ్మ‌కం కూడా ప్ర‌జ‌ల్లో ఇంత భారీ ఓటింగ్ కు కార‌ణం అయింది.

వెస్ట్ బెంగాల్ లో ముస్లీం ఓట‌ర్లు గంప‌గుత్త‌గా టీఎంసీకి మ‌ద్ద‌తు ఇస్తారు. వారు అంద‌రూ 90 శాతం ఆమె పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తారు, అయితే హిందూ ఓటు బ్యాంకు కూడా మ‌మ‌త‌కు స‌గం మ‌ద్ద‌తు ఉండేది ఈసారి హిందూ ఓటు బ్యాంకు 80 శాతం బీజేపీకి ద‌గ్గ‌రైంది..మాల్దా, ముర్షిదాబాద్ వంటి ముస్లిం ఆధిక్య జిల్లాల్లో కూడా బీజేపీ గెలిచింది అంటే మ‌నం అర్దం చేసుకోవ‌చ్చు ఆ ఓటింగ్ కూడా ఆమెకి ఎలా దూరం అయిందా అనేది

బీజేపీ కూడా మ‌మ‌త ముస్లింల‌కు అనుకూలంగా వ్య‌వ‌హిస్తున్నారు అని ఆరోప‌ణ‌లు చేసింది. ఈ స‌మ‌యంలో మ‌మ‌త ప్ర‌భుత్వ నిధుల‌తో కొన్ని హిందూ ఆల‌యాను నిర్మించారు. అయినా చాలా మంది హిందువులు ఆమెని ఈ విషంలో న‌మ్మ‌లేదు. ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హిందు ఓట్ల పోల‌రైజేష‌న్ జ‌రిగింది.

అధికార పార్టీకి ఎన్నిక‌ల స‌మ‌యంలో కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అయితే మ‌మ‌తకు ఇలాంటి అవ‌కాశం ఈసారి రాలేదు. కేంద్ర బ‌ల‌గాలు మొత్తం వెస్ట్ బెంగాల్ ని చుట్టాయి. ఈసీ రంగంలోకి దిగిక్షేత్ర‌స్ధాయి నుంచి అధికారులు మార్పు జ‌రిగింది, వీరిలో మ‌మ‌త‌కు స‌పోర్ట్ చేసేవారు ఎవ‌రూ లేరు. ఈసీ ఎంట‌ర్ అయిన స‌మ‌యం నుంచి సుమారు వెస్ట్ బెంగాల్ స్టేట్ లో 2.5 ల‌క్ష‌ల మంది కేంద్ర‌బ‌ల‌గాలు వ‌చ్చాయి. ఒక్క అవాంచ‌నీయ సంఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంతంగా ఇక్క‌డ ఎన్నిక‌లు చేశారు.

ఇలా మ‌మ‌త ఓట‌మికి అనేక కార‌ణాల్లో ఇవి ప్ర‌ముఖంగా వినిపిస్తుంటాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments