దుబాయ్ లో భారతీయ డ్రైవర్ కు లాటరీ
ఎన్ని కోట్లంటే
దుబాయ్ లో లాటరీ గురించి అందరికి తెలిసిందే, అక్కడ పనిచేసుకునే మన భారీతీయులు కూడా చాలా మంది ఆ లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు. అనేక సంస్ధలు అక్కడ లాటరీ నిర్వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేరళకు చెందిన వారు చాలా మంది ఈ లాటరీ దక్కించుకుని తమ లైఫ్ మార్చుకున్నారు. తాజాగా దుబాయ్ లో పనిచేస్తున్న ఓ ఇండియన్ డ్రైవర లాటరీ గెలుచుకున్నారు. అబుదాబిలో బిగ్ టికెట్ లాటరీ అతనికి దక్కింది. ఇందులో 64 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు ఆయన. అయితే ఈ లాటరీ మొత్తం గ్రూప్ గా దక్కింది. ఇందులో మరో 26 మంది కూడా ఉన్నారు. అతని స్నేహితులతో కలిసి ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. మొత్తం అందరూ కలిసి ఈ 64 కోట్లు పంచుకోనున్నారు. 25 మిలియన్ దిర్హమ్స్ ఈ లాటరీ ద్వారా గెలుచుకున్నారు ఈ బృందం.
కేరళకు చెందిన అబ్దుల్ రషీద్ 17 సంవత్సరాలుగా దుబాయ్ లోని ఎమిరాతి కుటుంబంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వారి ఇంటి సభ్యుడిగా అతన్ని చూసుకుంటారు. ఇక ఆరు సంవత్సరాలుగా తన ఫ్రెండ్స్ తో కలిసి బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేసేవాడు. మే 3 వ తేదిన తీసిన లాటరీలో వారి బృందం ఈ జాక్ పాట్ గెలుచుకుంది. ఇక మే 30 న పుట్టిన రోజు అందుకు గుర్తుగా ఈ లాటరీ టికెట్ కొన్నాను అని తెలిపాడు రషీద్.
అయితే కోట్లాది రూపాయలు వస్తున్నా తాను మాత్రం ఇక్కడ డ్రైవర్ గానే ఉంటాను అని, ఈ ప్రైజ్ మనీ తమ బృందం మొత్తం అందరూ పంచుకుంటామని తెలిపాడు . ఇక వీళ్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అందులో డ్రైవర్లు అలాగే టెక్నిషియన్స్ కూడా ఉన్నారని, వారు చాలా ఆనందంలో ఉన్నారు. మేము అందరూ కలిసి ఒక చోట ఉన్నాం, అప్పుడే ఈ నెంబర్ కు లాటరీ తగిలింది అని తెలిసింది, మా ఆనందానికి అవదులు లేవు అని తెలిపారు ఆయన. ఈ డబ్బుల గురించి తమ కుటుంబంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాము అని తెలిపాడు ఈ విన్నర్.

