అమెరికా ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ పై యుద్దం చేస్తున్నాయి. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనిని హతమార్చారు. అయితే ఇరాన్ లొంగుతుంది అని భావించిన అమెరికాకి ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. తాము చివరి మిస్సైల్ వరకూ పోరాటం చేస్తామని చెబుతున్నారు. తాము అమెరికాకి తలవొగ్గేది లేదంటున్నాయి ఇరాన్ సేనలు. అయితే ఇరాన్ ఇలా మాట్లాడుతుంటే అమెరికా కూడా కౌంటర్ ఇస్తోంది. ఖమేని తర్వాత ఇంకెవరు ఆ స్దానంలో ఉన్నా వారిని చంపేస్తామని హెచ్చరికలు ఇస్తోంది. ప్రపంచం తన గుప్పిట్లో ఉండాలని ట్రంప్ దుందుడుకుగా ముందుకు వెళుతున్నారు.
అయితే ఇరాన్ మిత్ర దేశాలు కూడా పరిస్దితిని గమనిస్తున్నాయి. ఇలాంటి వేళ ఈ యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్దితి. ఇక యూఏఈ ఇతర దేశాలపై కూడా ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. అమెరికా ఆర్మీ బేస్ లు ఎక్కడ ఉంటే అక్కడ దాడులు చేస్తున్నాయి. ఇక ఇరాన్ లో ఐఆర్ జీసీ చాలా సీరియస్ గా ఉంది. తమని తక్కువ అంచనా వేయవద్దని ఇజ్రాయెల్ అమెరికాకి సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. సహనానికి పరీక్ష పెడితే అంతిమంగా మీరే బాధ్యులు అవుతారంటూ ఐఆర్జీసీ హెచ్చరిస్తోంది. అయితే వీటిని ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాము ఇరాన్ పై యుద్దం ఎప్పుడు ముగిస్తామో ఎవరికి తెలియదు. మేము అనుకున్న సమయంలో యుద్దం ముగిస్తామంటూ ఇరాన్ పై ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. అయితే దీనికి కూడా ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఈ యుద్దం ముగింపు అమెరికాకి తెలియదు ఇరాన్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు యుద్దం ముగుస్తుంది అని కౌంటర్ ఇచ్చింది. యుద్దం ఆపడం అనేది మా చేతుల్లో ఉంది అని ఇరాన్ కౌంటర్ ఇస్తోంది.
అంటే అమెరికా సైన్యం దాడులు ఆపినా తాము ఆపము అనే సంకేతాన్ని ఇచ్చింది స్పష్టంగా.. ఇరాన్ పై తమ సేన జరిపిన దాడుల్లో లక్ష్యాలు చేరుకున్నాం వారి ఆయుధ నిల్వలు కూడా సగానికి పైగా తగ్గించామంటూ ట్రంప్ మాట్లాడారు. అమెరికా ముందు దాడి చేసింది ఒకవేళ మేము దాడి చేయకపోతే కచ్చితంగా ఇరాన్ తర్వాత వారం దాడి చేయడానికి సిద్దంగా ఉందని. ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున క్షిపణులు ఉన్నాయని అన్నారు. ఇరాన్ శత్రుదేశాలపై దాడులకు సిద్దం అవుతున్న వేళ తాము ముందుగా దాడి చేశామని ట్రంప్ అన్నారు. ట్రంప్ మాటలబట్టి అమెరికాలో కూడా ఒత్తిడి పెరుగుతోంది. అక్కడ ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ దేశం పై దాడి వల్ల తమ దేశంలో నిల్వలు తగ్గుతున్నాయి ఆర్దిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఆయుధ సంపద దూరం అవుతుంది. దీనికి ముగింపు పలకాలి అని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు.
అలీ ఖమేనీ కుమారుడు అయతుల్లా మోజ్తబా ఖమేనొని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. అయితే దీని గురించి బయట మీడియాకు మాత్రం అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఈ యుద్దం 11 రోజులకి చేరింది. బహ్రెయిన్, దుబాయ్ ఇలా యూఏఈలో పలు దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 8 మంది అమెరికా సైనికులు మరణించారు. అయితే ట్రంప్ యుద్దం ఈనెలాఖరుకల్లా నిలిపివేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ మళ్లి కాల్పులు జరిపినా మిస్సైల్స్ వేసినా కచ్చితంగా ఇరాన్ భూభాగంలోకి అమెరికా ఆర్మీ వెళ్లే ఆస్కారం ఉందని, ఇది మరింత యుద్దానికి కారణం అవ్వవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు.

