HomeFinanceగ్యాస్ కొర‌త - హోట‌ల్స్ షాకింగ్ ప్ర‌క‌ట‌న

గ్యాస్ కొర‌త – హోట‌ల్స్ షాకింగ్ ప్ర‌క‌ట‌న

మిడిల్ ఈస్ట్ లో నెల‌కొన్న యుద్ద ప‌రిస్దితుల‌తో చాలా ప‌రిశ్ర‌మ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ముఖ్యంగా చ‌మురు దిగుమతులు ఆగిపోయాయి ర‌వాణా మార్గం మూసివేయ‌డంతో కొత్త‌గా ఓడ‌లు ఎక్క‌డ నుంచి బ‌య‌లుదేర‌ని ప‌రిస్దితి. దీంతో చాలా రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా టిఫిన్ భోజ‌నం హోట‌ల్స్ రెస్టారెంట్ల పై ఇది తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే వీరి అవ‌స‌రాల‌కు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్లను కేంద్రం స‌ర‌ఫ‌రా చేస్తుంది. అయితే వీటి ధ‌ర కూడా ఈ యుద్ద ప్ర‌భావంతో భారీగా పెరిగింది. దీంతో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది. మ‌న దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ ఎఫెక్ట్ ఇప్ప‌టికే క‌నిపిస్తోంది. ముఖ్యంగా బెంగ‌ళూరు, చెన్నై, ముంబై, హైద‌రాబాద్ లో ఇబ్బందిక‌ర ప‌రిస్దితి క‌నిపిస్తోంది, అయితే బ‌య‌ట గ్యాస్ కొనుగోలు చేయ‌లేక స‌ప్లై లేక‌ చాలా హోట‌ల్స్ మూసివేస్తున్నారు. ఇప్ప‌టికే బెంగ‌ళూరులో ర‌ద్దీ ఏరియాల్లో దాదాపు 9 శాతంహోట‌ల్స్ మూసివేయ‌డం జ‌రిగింది ముంబైలో కూడా ప్ర‌ధాన హోట‌ల్స్ 20 శాతం మూసివేయ‌డం జ‌రిగింది. దీంతో గ్యాస్ సప్లై పెంచాల‌ని కంపెనీల‌కి కేంద్రం తెలియ‌చేసింది.

అయితే గృహ అవ‌స‌రాల‌కు కూడా గ్యాస్ బుకింగ్ మ‌ధ్య గ్యాప్ 25 రోజుల‌కి పెంచారు. అంటే ఒక రీఫిల్ బుకింగ్ డెలివ‌రీ అయిన త‌ర్వాత మ‌ళ్లీ 25 రోజుల‌కి రెండో బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ప‌రిస్దితుల్లో చాలా మంది 10 రోజుల‌కి 15 రోజుల‌కి రెండో రిఫిల్ బుకింగ్ చేస్తున్నారు. అందుకే కేంద్రం ఆంక్ష‌లు పెట్టింది. దీని వ‌ల్ల అవ‌స‌రం ఉన్న వారికి గ్యాస్ దొరుకుతుంది.

ఈ గ్యాస్ కొర‌త‌పై ఇప్ప‌టికే బెంగ‌ళూరులో ప‌రిస్దితి దారుణంగా ఉంద‌ని, తాము కూడా ఏమీ చేయ‌లేక హోట‌ల్స్ రెస్టారెంట్లు మూసివేస్తున్నామ‌ని బెంగ‌ళూరు హోట‌ల్స్ అసోసియేష‌న్ కూడా తెలియ‌చేసింది. ప్ర‌త్యామ్నాయం దీనికి ఏమీ ఉండ‌దు క‌నుక మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్దితులు వ‌చ్చిన త‌ర్వాత హోట‌ల్స్ తెరుస్తాము అంటున్నారు. అయితే ఇక్క‌డ ఇంటికి వాడే ఎల్పీజీ హోట‌ల్స్ లో వాడితే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు. హోట‌ల్స్ సీజ్ చేస్తారు అందుకే అందుబాటులో గ్యాస్ లేక‌పోతే హోట‌ల్స్ మూసివేయ‌డ‌మే మాకు ఉన్న మార్గం అంటున్నారు హోట‌ల్ య‌జ‌మానులు .

పెట్రోల్ – డిజీల్ -గ్యాస్ కి మ‌న దేశంలో 72 రోజుల వ‌ర‌కూ లోటు లేదు అని కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కాని క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ఎందుకు అందుబాటులో లేదు అని కొంద‌రు వ్యాపారులు ప్ర‌శ్నిస్తున్నారు. ముంబై చెన్నైలో ఎక్కువ సేపు ఉడికించేవి అలాగే ఎక్కువ గ్యాస్ అవ‌స‌రం ఉండే క‌ర్రీలు వారి మెను నుంచి తీసేశారు. కొంద‌రు ఉద్యోగుల‌ని మాత్ర‌మే రోజు ర‌మ్మ‌ని చెబుతున్నారు. దీని వ‌ల్ల డైలీ వ‌ర్క్ చేసుకునే వారికి కూడా ఉపాధి దూరం అవుతోంది. హాస్ట‌ల్స్, హోట‌ల్స్, హ‌స్ప‌ట‌ల్ ద‌గ్గ‌ర ఈ గ్యాస్ కొర‌త‌తో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

అయితే కేంద్రం చెప్పిన దాని ప్ర‌కారం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు గ్యాస్ వ‌చ్చిన‌ త‌ర్వాత, వాటిని గృహ అవ‌స‌రాల‌కు అలాగే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల‌ను ఆస్ప‌త్రులు విద్యా సంస్ధ‌ల‌కు ఇలా అత్య‌వ‌స‌ర రంగాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అందుకే వారికి వ‌చ్చిన స్టాక్ ని కోర‌లేక‌పోతున్నాము అంటున్నారు హోట‌ల్స్.. ఇటీవ‌ల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దేశంలో పెట్రోల్ డిజీల్ ధ‌ర‌లు పెంచేది లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే మిగిలిన దేశాల్లో మాత్రం పెట్రోల్ డిజీల్ ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. ఇంకొన్ని రోజులు ప‌రిస్దితి ఇలాగే ఉంటే హైద‌రాబాద్ కూడా ఎఫెక్ట్ అవ్వ‌చ్చు అంటున్నారు వ్యాపారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments