Homeవ్యాపారంవావ్ కోటి రూపాయల బైక్ - ముంబైలో మొదటి డెలివరీ

వావ్ కోటి రూపాయల బైక్ – ముంబైలో మొదటి డెలివరీ

వావ్ కోటి రూపాయల బైక్
ముంబైలో మొదటి డెలివరీ

ఖ‌రీదైన కార్లు ఖ‌రీదైన బైకులు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ విదేశాల నుంచి వాటిని మ‌న దేశానికి దిగుమ‌తి చేసుకుంటారు. తాజాగా ఓ బైక్ ఇప్పుడు దేశంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అదే ఇటాలియ‌న్ మోటార్ సైకిల్ సంస్ధ డుకాటి. తాజాగా అత్యంత ప్రీమియం ఎడిష‌న్ బైక్ ని దింపింది కంపెనీ. ఈ మోడ‌ల్ పేరు డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని. ఇక దీని రేటు దాదాపు కోటి 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌లుకుతోంది. ఇది చాలా లిమిటెడ్ ఎడిష‌న్ . చెప్పాలంటే ప్ర‌పంచ వ్యాప్తంగా కేవ‌లం 600 యూనిట్లు త‌యారు చేశారు.

ప‌రిమిత బుకింగ్స్ తో దీనిని క్లోజ్ చేశారు. ముందు ఎవ‌రు బుక్ చేసుకుంటే వారికి డెలివ‌రీ ఇస్తున్నారు. ఇక పెద్ద పెద్ద కంపెనీల య‌జ‌మానులువారి పిల్ల‌లు ఇప్పటికే వీటిని ఆర్డ‌ర్ చేసుకుంటున్నారు. ఇటీవ‌ల ప్రీ ఆర్డ‌ర్ తీసుకున్న కంపెనీ మొదటి మోటార్ సైకిల్‌ను ముంబైలో డెలివరీ చేసింది.

భార‌త్ కు వ‌చ్చిన అత్యంత ఖ‌రీదైన బైక్ ల‌లో ఇది కూడా ఒక‌టిగా తెలియ‌చేస్తున్నారు . ఇక కంపెనీ మ‌రో ప్రీమియం వెర్ష‌న్ కూడా తీసుకువ‌స్తోంది. స్పెషాలీ క్లయింటి ఎడిషన్‌ను తీసుకువ‌స్తోంది. ఇవి ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 60 యూనిట్లు త‌యారు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే లంబోర్గిని కార్లు ఎవ‌రు వాడుతున్నారో వారే ఈ బైక్స్ కూడా ఆర్డ‌ర్ ఇస్తున్నారు, వారు వాడే కార్ల రంగులో ఈ బైక్స్ కూడా ఆర్డ‌ర్ ఇస్తున్నారు.

డయావెల్ 1260 లంబోర్గిని తర్వాత. డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని తీసుకువ‌చ్చింది. ఫోర్డ్స్ అల్యూమినియం వీల్స్ అలాగే అత్యాధునిక ఆటోమోబైల్ పార్ట్ ల‌తో దీనిని తీర్చిదిద్దారు. ఇక బ‌రువు ఎక్కువ‌గా ఉంటుంది అనే పేరు రావ‌డంతో ఈ బైక్ బ‌రువు త‌క్కువ‌గా తీర్చిదిద్దారు. దీని కోసం కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. 5 లేయ‌ర్ ప్రొటెక్ష‌న్ కూడా దీని బాడీకి ఉంటుంది.1,103సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ V4 ఇంజన్‌ను ఇందులో అమ‌ర్చారు . దీనికి ఆరు గేర్లు ఉంటాయి. సుమారు దీని బ‌రువు 185 కిలోలు ఉంటుంది. చెప్పాలంటే ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ప‌నిగేల్ సిరీస్ లో అత్యంత త‌క్కువ బ‌రువు ఉన్న బైక్ ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments