Homeవినోదంస‌బ్బుల కంపెనీ యాడ్ .. హైకోర్టులో హీరోయిన్ తమన్నాకు ఎదురుదెబ్బ

స‌బ్బుల కంపెనీ యాడ్ .. హైకోర్టులో హీరోయిన్ తమన్నాకు ఎదురుదెబ్బ

స‌బ్బుల కంపెనీ యాడ్
హైకోర్టులో హీరోయిన్
తమన్నాకు ఎదురుదెబ్బ

సినిమా సెల‌బ్రెటీలు యాడ్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి, వారి ఫోటోలు వీడియోలు చాలా కంపెనీలు వాడుకుంటాయి. దానికి సంబంధించి వారి నుంచి లీగ‌ల్ గా అప్రూవల్స్ తీసుకుంటారు. ఈ హ‌క్కులు ఒక ఏడాది లేదా కొన్ని నెల‌లు లేదా రెండు మూడు సంవ‌త్స‌రాలు కూడా ప్ర‌క‌ట‌న‌ల కోసం రైట్స్ తీసుకుంటాయి కంపెనీలు. అవి ముగిసిన త‌ర్వాత కూడా ఆ హీరో హీరోయిన్లు సెల‌బ్రెటీల గురించి కంపెనీలు యాడ్స్ ఇస్తే మాత్రం దానిపై లీగ‌ల్ గా కేసులు వేసుకోవ‌చ్చు.

తాజాగా త‌మ‌న్నా విష‌యంలో కూడా ఇప్పుడు ఈ కేసు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌ద్రాసు హై కోర్టు ఆమె వేసిన కేసుపై షాకిచ్చింది. త‌న అనుమ‌తి లేకుండా ఫోటోలని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కోసం ప‌వ‌ర్ సోప్స్ లిమిటెడ్ కంపెనీ వాడింద‌ని ఆ కంపెనీ పై ఆమె కేసు వేసింది. ఒక కోటి రూపాయ‌ల వ‌ర‌కూ న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేసింది.

ఆమె వేసిన పిటిష‌న్ న్యాయస్థానం కొట్టివేసింది. 2008లో కంపెనీతో ఓ ఒప్పందం జ‌రిగింది, ఆ సోప్స్ కంపెనీతో ఏడాది అగ్రిమెంట్ చేసుకున్నారు త‌మ‌న్నా. అయితే 2009లో అగ్రిమెంట్ ముగిసినా ..2010 న‌వంబ‌ర్ నుంచి 2011 ఫ్రిబ్ర‌వ‌రి వ‌ర‌కూ నా అనుమ‌తి లేకుండా త‌న ఫోటోలు స‌బ్బు క‌వ‌ర్లు అలాగే బ్యాన‌ర్ల‌పై పోస్ట‌ర్లు వేశారు అని ఆమె ఫిర్యాదు చేసింది.

అయితే ఈ స‌వాల్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు. అలాగే ఎలాంటి సాక్ష్యాలు లేవు అని త‌మ‌న్నా వాద‌న‌ని తోసిపుచ్చారు. ఇక ఆమె సింగిల్ జ‌డ్జ్ నుంచి డివిజ‌న్ బెంచ్ కు దీనిని తీసుకువెళ్లారు. కేవ‌లం ఆరోప‌ణ‌లు స‌రిపోవు దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా కావాలి అని తెలిపారు చివ‌ర‌కు ఆమె పిటిష‌న్ కొట్టివేశారు. అందుకే ఇలాంటి విష‌యాల్లో ఆ కంపెనీలు యాడ్స్ విష‌యంలో మోసం చేస్తే, దానికి సంబంధించి స‌రైన ఆధారాలు కోర్టుకి స‌బ్ మీట్ చేయాల్సిందే.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments