Homeఅంతర్జాతీయఇరాన్ ఎఫెక్ట్ - భారీగా పెర‌గ‌నున్న వీటి ధ‌ర‌లు

ఇరాన్ ఎఫెక్ట్ – భారీగా పెర‌గ‌నున్న వీటి ధ‌ర‌లు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం తో సామాన్యుల నెత్తి మీద పిడుగు ప‌డిన‌ట్లైంది. ఇరాన్ త‌మ సుప్రీం లీడ‌ర్ ని కోల్పోవడంతో, అమెరికా ఇజ్రాయెల్ దేశాల‌పై క‌క్ష క‌ట్టింది. ఇత‌ర దేశాల్లో ఉన్న వారి ఆర్మీ బేస్ క్యాంపుల‌పై దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ప‌రిస్దితి గంద‌రగోళంగానే ఉంది. అయితే భార‌త్ కూడా ఈ వార్ కు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ గ‌ల్ఫ్ ఇరాన్ నుంచి వ‌చ్చే అనేక ఉత్ప‌త్తులు ర‌వాణా నిలిచిపోనుంది. స‌రుకు ర‌వాణా ఆగిపోవ‌డంతో మ‌న దేశంలో స‌రుకుల కొర‌త ఏర్ప‌డి ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌నున్నాయి.

ముఖ్యంగా చ‌మురు ధ‌ర‌లు ** మ‌న‌కు నెల రోజుల వ‌ర‌కూ చ‌మురు నిల్వ‌లు ఉన్నాయ‌ని ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం తెలియచేస్తున్నా, నెల రోజుల పాటు ప‌రిస్దితి ఇలా ఉంటే చ‌మురు కొర‌త తథ్యం అంటున్నారు. . ఇక ఇప్ప‌టికే ఆదాయం త‌క్కువ, ఖ‌ర్చులు ఎక్కువ ఉండ‌టంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్యుల‌కు ఇది పెద్ద స‌మ‌స్య‌గా మార‌నుంది.

ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి వ‌చ్చే వ‌స్తువులు సుమారు నెల రోజుల పాటు వ‌ర‌కూ నిలిచిపోనున్నాయి. చ‌మురు త‌ర్వాత మ‌న‌కు ప‌ప్పు ధాన్యాలు కూడా ఇక్క‌డ నుంచి భారీగా దిగుమ‌తి అవుతున్నాయి. నౌక‌ల ద్వారా ర‌వాణా నిలిచిపోతే ప‌ప్పు ధాన్యాలు కొర‌త ఏర్ప‌డుతుంది. దాదాపు కేజీకి 30 నుంచి 40 రూపాయ‌ల వ‌ర‌కూ ధ‌ర‌లు పెర‌గ‌వ‌చ్చు. మ‌న దేశం పప్పు ధాన్యాలను దాదాపు 45 శాతం దిగుమ‌తి చేసుకుంటుంది. మెజార్టీ కెన‌డా, ఆఫ్రీకా, మ‌య‌న్మార్ ఈ దేశాల నుంచి మ‌న‌కు దిగుమ‌తి అవుతున్నాయి. అయితే హోర్ముజ్ జలసంధి మూసివేస్తే ఈ నౌక‌లు భార‌త్ కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. స‌రుకు ర‌వాణా నిలిచిపోతే కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు, శ‌న‌గ‌లు, గ్రీన్ బ‌ఠానీ, పెద్ద శ‌న‌గ‌లు, ఇలాంటివి ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి.

అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్క‌డ నుంచి దిగుమ‌తి అవుతున్నాయి. వీటి ధ‌ర‌లు కూడా భారీగా పెర‌గ‌నున్నాయి. పిస్తా
ఎందుద్రాక్ష, బాదం, కుంకుమ పువ్వు ఇలాంటివి మ‌న‌కు దిగుమ‌తి అవుతాయి. యుద్దం వ‌ల్ల ఈ దిగుమ‌తులు కూడా ఆగుతాయి. అంతేకాకుండా డాల్డా, వంట నూనెల ధ‌ర‌లు కూడా భారీగా పెర‌గ‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments