Homeఅంతర్జాతీయఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్లకు గుడ్ న్యూస్ - కోట్లాదిమంది హ్యాపీ

ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్లకు గుడ్ న్యూస్ – కోట్లాదిమంది హ్యాపీ

ఇన్ స్టాగ్రామ్ యూజ‌ర్లు ఎప్ప‌టి నుంచో ఓ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇన్ స్టా యూజ‌ర్ల కోసం ఓ మార్పుని అయితే తీసుకువ‌చ్చింది కంపెనీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ యూజ‌ర్లు రీల్స్ చూస్తున్న స‌మ‌యంలో వీడియో మ‌ధ్య‌లో ఆపాలి అంటే, ఆ వీడియోని గ‌ట్టిగా నొక్కి ప‌ట్టుకోవాలి. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా యూజ‌ర్లు దీనిని మార్చాలి అని కోరారు. అన్నీ యాప్స్ లో జ‌స్ట్ ఒక్క‌సారి ప్రెస్ చేస్తే వీడియో ఆగిపోతుంది. కానీ ఇన్ స్టా ఇలా ఎందుకు మార్పు చేయ‌డం లేదని అంద‌రూ ప్ర‌శ్నించారు. దీంతో కంపెనీ టెక్నిక‌ల్ గా దీనిని సాల్వ్ చేసింది.

కేవలం ఒక్కసారి స్క్రీన్‌ను టచ్ చేస్తే చాలు, వీడియో అక్కడికక్కడే ఆగిపోతుంది. తాజాగా దీనిని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది కంపెనీ. ట్యాప్ టూ పాజ్ అనే ఫీచ‌ర్ ని యూజ‌ర్ల‌కు తీసుకువ‌చ్చింది. ఇక వీడియోకి ఉన్న కాప్ష‌న్ చ‌ద‌వాలి అన్నా, అలాగే ఆ కంటెంట్ ఏమిటి అనేది తెలియాల‌న్నా ఈజీగా చూసుకోవ‌చ్చు. ఇక వీడియో పాజ్ చేసిన స‌మ‌యంలో మ్యూట్ ఆప్ష‌న్ కూడా క‌నిపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఐవోఎస్ యూజ‌ర్ల‌కు ఈ అప్ డేట్ ద‌శ‌ల వారిగా వ‌స్తుంది అని తెలిపింది కంపెనీ.

ఇక ఇన్ స్టా క్రియేట‌ర్ల కోసం ఏఐ ఆధారిత ఫీచ‌ర్ల‌ను కూడా తీసుకువ‌స్తోంది. ముఖ్యంగా వాయిస్ ఎఫెక్ట్ ఫీచ‌ర్ తీసుకువ‌స్తుంది. దీంతో మీరు ర‌క‌ర‌కాల వాయిస్ మాడ్యులేష‌న్ ఇవ్వ‌వ‌చ్చు, ఇక ఏఐ స్వాఫ్ ఫీచ‌ర్ ని కూడా తీసుకువ‌స్తుంది. త‌మ పోలిక‌ల‌తో ఏఐ ద్వారా చిత్రాలు కూడా మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవ‌చ్చు. అయితే దీనిపై టెక్ నిపుణులు ఇది యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త గోప‌త్య‌కు భంగం క‌లుగుతుంది అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం యూజ‌ర్ల అనుమ‌తితో దీనిని తీసుకుంటాము అని తెలిపింది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments