Homeవినోదంల‌వ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన అల్లు శిరీష్‌

ల‌వ్ స్టోరీ బ‌య‌ట‌పెట్టిన అల్లు శిరీష్‌

ఈనెల 6 వ తేదిన అల్లు శిరీష్ – న‌య‌నిక వివాహం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మెగా అల్లు కుటుంబాలు ఎంతో పండుగ‌గా ఈ వివాహం జ‌రుపుతున్నాయి. అల్లు శిరీష్ నిశ్చితార్థం నుంచి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరకు అన్నీ వాళ్ల రేంజ్ కు త‌గ్గ‌ట్టు చేశారు. ఇక ఇంట్లో చిన్న కుమారుడు కావడంతో పెళ్లి విష‌యంలో అల్లు అర‌వింద్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇటీవ‌ల త‌న ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ కి దుబాయ్ లో ఓ క్రూయిజ్ షిప్‌లో బ్యాచిల‌ర్స్ పార్టీ కూడా ఇచ్చారు శిరీష్.

ఎల్లుండి నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేయబోతున్నారు. అయితే తాజాగా వీరి ల‌వ్ స్టోరీ గురించి బ‌య‌ట‌పెట్టారు శిరీష్. అస‌లు వీరి ఇద్ద‌రి ప్రేమ ఎప్పుడు మొద‌లైంది అనేది చూస్తే. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి త‌ర్వాత వారి వెడ్డింగ్ ని హీరో నితిన్ ఆయ‌న భార్య షాలినీ క‌లిసి సెల‌బ్రేట్ చేశారు. ఈ స‌మ‌యంలో షాలినీ బెస్ట్ ఫ్రెండ్ నయ‌నిక ఆ పార్టీకి రావ‌డం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో శిరీష్ న‌య‌నిక‌ని చూసి ప్రేమ‌లో ప‌డ్డారు.

ఇక న‌య‌నిక సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఆమె కాదు, వారి కుటుంబం అంతా ఎప్ప‌టి నుంచో వ్యాపారాల్లో ఉన్నారు.ఆమె పుట్టి పెరిగింది హైద‌రాబాద్ బాగా చ‌దువుకుంది. చ‌దువు పూర్తి అయిన త‌ర్వాత సొంతంగా ఓ స్టార్ట‌ప్ కూడా ప్రారంభించింది. ఇలా ఇద్ద‌రు ప్రేమించుకున్న త‌ర్వాత రెండేళ్ల‌కు కుటుంబ స‌భ్యుల అంగీకారంతో వివాహం చేసుకుంటున్నారు.

న‌య‌ని చాలా ప్రైవేట్ ప‌ర్స‌న్. ఆమె ఇన్ స్టా అకౌంట్ కూడా ప్రైవెట్ లోనే ఉండేది, శిరీష్ తో ఎంగేజ్ మెంట్ త‌ర్వాత ఆమె అకౌంట్ ప‌బ్లిక్ చేసింది. రెండు సంవ‌త్స‌రాలు ఒక‌రిని ఒక‌రు అర్దం చేసుకున్నారు. ఇక అల్లు అర‌వింద్ అలాగే ఆయ‌న భార్య కూడా కుమారుడి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇరు కుటుంబాలు కలిసి వీరి పెళ్లిని నిర్ణ‌యించాయి, ఇక త‌న ల‌వ్ స్టోరీ గురించి పిల్ల‌లు మీరిద్ద‌రు ఎలా క‌లుసుకున్నారు అని అడిగితే ఈ స్టోరీ అంతా చెబుతా అంటూ శిరీష్ తెలియ‌చేశారు. ఇలా త‌న భార్య‌ని క‌లుసుకున్నా అనే విష‌యం త‌మ పిల్ల‌ల‌కు చెబుతాన‌ని స‌ర‌దాగా మాట్లాడారు అల్లు శిరీష్.

నితిన్ భార్య షాలినీ- న‌య‌ని ఇద్ద‌రు మంచి స్నేహితులు. ఇలా వ‌రుణ్ లావ‌ణ్య పెళ్లి పార్టీతో శిరీష్ కు లైఫ్ పార్ట‌న‌ర్ దొరికింది అనేది క్లారిటీ వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments