ఆదివారం వచ్చింది అంటే కచ్చితంగా చికెన్ తినేవారు చాలా మంది ఉంటారు. కొందరు అయితే వారానికి రెండు మూడు రోజులు కచ్చితంగా చికెన్ ఇష్టంగా తింటారు. అయితే తాజాగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసివేస్తామని ప్రకటన చేశారు. ఇది నిజంగా చికెన్ ప్రియులకి షాకిచ్చే వార్త అని చెప్పాలి.పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వకపోవడంపై ,ఆగ్రహం వ్యక్తం చేసింది చికెన్ షాపు అసోసియేషన్.
ఇక చికెన్ ధర ఎంత పెరుగుతున్నా మాకు వచ్చే కమీషన్ అదే ఉంటోంది. దీని వల్ల ఖర్చులు పెరిగిపోయి ఎలాంటి లాభం పొందడం లేదు. కస్టమర్లు పేపర్ రేట్ చూపించి ఈ రేటుకి చికెన్ కావాలి అని కోరుకుంటున్నారు. దీని వల్ల చాలా మంది వ్యాపారులు నష్టపోతున్నామని అసోసియేషన్ తెలిపింది ..కిలో చికెన్ పేపర్ రేటు రూ. 360 నుంచి రూ. 370 వరకు ఉండగా, షాపు మెయింటెనెన్స్ ఖర్చుల వల్ల మరో పది అదనంగా కలిపి అమ్మాల్సి వస్తోంది.
పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమీషన్, మార్జిన్ గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని చికెన్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.కిలోకి 20 వరకూ తగ్గించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రేట్లు పెరుగుతున్నాయి మాకు లభించే లాభం తగ్గిపోవడం వల్ల వ్యాపారం సాగించడం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఇక ప్రభుత్వం కూడా తమ సమస్యకు పరిష్కారం చూపాలని పౌల్ట్రీలతో మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. తమ సమస్యలకు పరిష్కారం దొరికే వరకూ తాము ఈ నిరసన తెలియచేస్తామని, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగాచికెన్ దుకాణాలు మూసివేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కొన్ని షాపుల దగ్గర వ్యాపారులు దీనికి సంబంధించి బోర్డులు బ్యానర్లు కట్టారు.

