పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓ పక్క ఆయన అభిమానులు చిరకాల కోరిక నెరవేరింది. ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే సినిమాల విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ కల్యాణ్ కేవలం సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేశారు. ఇక ఈ సినిమాల షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఆయన సినిమాలు చేయకపోవచ్చు అనే వార్తలు వినిపించాయి.
పూర్తిగా తన సమయం రాజకీయాలకే కేటాయించాలి అని పవన్ భావిస్తున్నారు. ఇలాంటి వేళ తాజాగా తన చిరకాల కోరిక తెలియచేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఒక సినిమా నిర్మించాలనేది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. బాలినేని అంటే పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం. అందుకే వైసీపీలో ఆయన ఇమడలేక చివరకు జనసేనలో చేరారు. పవన్ కూడా ఆయన రాకను స్వాగతించారు.
అయితే తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి. పవన్ కనుక ఒకే చెబితే ఆయనతో సినిమా చేయాలని ఉందని అన్నారు. సో మొత్తానికి సీనియర్ పొలిటీషియన్ ఈ కామెంట్ చేయడంతో పవన్ ఏమైనా ఆయనకు అవకాశం ఇవ్వచ్చా అనే కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ ఒకే అనాలికానీ, టాలీవుడ్ లో దాదాపు పది నిర్మాణ సంస్ధలు అయినా ఆయనతో సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ తదుపరి సినిమాలు ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు ఒకే చేయలేదు. అయితే ఆయన ఏడాదికి ఒక సినిమాలో అయినా నటించాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

