మన శరీరంలో అన్నీ ఆర్గాన్స్ కూడా ఎంతో ముఖ్యం. గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదంతా మనచేతుల్లోనే ఉంది. మన ఆహార అలవాట్లు మన శారీరక శ్రమపైనే వీటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొందరు లేని పోని అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజు కిడ్నీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వైద్యులు తెలియచేస్తున్నారు మరి ఆ జాగ్రత్తలు తెలుసుకుందాం.
ప్రతి యేటా మార్చి 12 న ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు అనేక మంది వైద్యులు కూడా స్పెషల్ ఆర్టికల్స్ రాయడం, మీటింగ్స్ పెట్టడం సెమినార్స్ కండెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోమని చెప్పడానికే.
1.ముందుగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీరు రోజుకి కనీసం మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకూ తాగాలి. మన శరీరం నుంచి మలినాలను ఈ వాటర్ ద్వారా కిడ్నీలు బయటకు పంపిస్తాయి.
2. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పప్పుదినుసులు, ఆకుకూరలు, తాజా పండ్లు, ఇలాంటి ఆహారం మనకు రోజు వారి డైట్ లో ఉండాలి.
3. ఇక శారీరక శ్రమ కూడా కిడ్నీల పనితీరుకి చాలా అవసరం. కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి
ఇలా చేస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఎలాంటి సమస్యలు రావు.
4. టీ కాఫీ మద్యం వీటికి దూరంగా ఉండాలి. అలాగే బాగా ఆయిల్ లో ఫ్రై చేసిన ఆహారం కూడా తీసుకోకూడదు. కచ్చితంగా ఉదయం రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది.
5. అధిక ఉప్పు ఉండే ఆహరం తీసుకోవద్దు, అలాగే అధిక షుగర్ ఫుడ్ ని కూడా దూరం చేయాలి. మంసాహారం కూడా మీరు తగ్గించుకోవాలి.
6.మందులు అవసరమైతేనే వాడాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
7. బీపీ షుగర్ సమస్య ఉన్న వారు కచ్చితంగా ప్రతీ ఏడాది కిడ్నీలకు సంబంధించి చెకప్ చేయించుకోవడం టెస్టులు చేయించుకోవడం మంచిది.
8. మద్యం అలవాటు ఉండకూడదు, పొగతాగడం కూడా మంచిది కాదు కిడ్నీలకు.
** కిడ్నీలు బలంగా ఉండడానికి తినాల్సిన ఆహారాలు చూద్దాం**ఆపిల్
క్యాబేజ్
కాలిఫ్లవర్
ఉల్లిపాయ
వెల్లుల్లి
చెర్రీపండ్లు
రెడ్ క్యాప్సికమ్
చేపలు
బ్లూబెర్రీ
ఆలివ్ ఆయిల్
** కిడ్నీలను నెమ్మదిగా పాడుచేసే ఆహారాల గురించి తెలుసుకుందాం**
1.కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా తక్కువ మొత్తంలో ఉప్పుతినాలి ఇది చాలా డేంజర్
2.ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్
3. పంచదార, బెల్లం కలిపి చేసిన ఆహారాలు పానీయాలు కూడా కిడ్నీలకు డేంజర్
4. రెడ్ మీట్
5. ప్రాసెస్ చేసిన మాంసం
6. ఆల్కహాల్
7. కొన్నిరకాల పసర్లు కూడా కిడ్నీలకు డేంజర్ వైద్యుల సలహాతోనే అవి తీసుకోవాలి
8. సోడాలు డ్రింకులు.

