ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్దం ఇప్పుడు భారత్ లో చాలా రంగాలపై పడుతోంది. దేశ వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు ఎక్కడా దొరకని పరిస్దితి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గృహ అవసరాలకు మాత్రమే మేజర్ గా ప్రొడక్షన్ చేస్తున్నాయి కంపెనీలు. ఎందుకంటే ఇంటి అవసరాలకు గ్యాస్ ఇవ్వకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు వస్తాయి. అందుకే మోదీ ప్రభుత్వం ముందుగానే ఇది ఆలోచించి నిర్ణయం తీసుకుంది.
ఇక కొన్ని హోటల్స్ అయితే గ్యాస్ సరఫరా లేక హోటల్స్ మూసివేస్తున్నారు. మరికొందరు మెనులో కొన్ని ఐటెమ్స్ తగ్గించేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యి పై వండుతున్నారు. అయితే బ్లాక్ మార్కెట్లో కూడా ఎక్కడా గ్యాస్ దొరక్కుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రంజాన్ సీజన్ కావడంతో చాలా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి వేళ జొమాటొ, స్విగ్గీలకు బిగ్ షాక్ తగిలింది.
ఇప్పటికే ముంబై చెన్నై బెంగళూరులో 25 శాతం మాత్రమే రెస్టారెంట్లు జొమాటొ, స్విగ్గీ ఆర్డర్లను ఒకే చేస్తున్నాయి. మరో వారం పరిస్దితి ఇలా ఉండే ఇక 10 శాతానికి పడిపోవచ్చు. రెస్టారెంట్లు చాలా వరకూ ఈ మెనులని తగ్గించేశాయి. మరికొన్ని రెస్టార్టెంట్లు అయితే అస్సలు ఈ ఆప్షన్ తీసివేశాయి. గ్యాస్ కొరత తీరిన తర్వాతే మళ్లీ హోటల్స్ లో జొమాటొ, స్విగ్గీ ఆర్డర్లు స్వీకరిస్తామని తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనిపై ప్రకటన చేసింది.
గ్యాస్ కొరతతో కొందరు హోటల్స్ మూసివేస్తున్నారు మరికొందరు రేట్లు పెంచడం కూడా జరిగింది. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు. ఇక శుక్రవారం నుంచి కొన్ని ఐటెమ్స్ మెనులో కూడా తగ్గిస్తామని తెలిపారు. ఇప్పటికే 50 శాతం రెస్టారెంట్లు జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను నిలిపివేశాయి, త్వరలోనే స్టార్ హోటల్స్ లో కూడా నిలిపివేస్తామన్నారు. ఇక గ్యాస్ కొరత తీరే వరకూ ప్రతీ సోమవారం రెస్టారెంట్లు పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడే ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఏపీ తెలంగాణలో రోజు కుకింగ్ వర్క్ చేసుకునే వారిపై పెద్ద ఎఫెక్ట్ పడింది. గ్యాస్ కొరతతో కొందరు ఫుడ్ విషయంలో ఆలోచించి పెళ్లి తేదీలు కూడా మార్చుకుంటున్నారు. అయితే పది రోజులుగా దేశ వ్యాప్తంగా రెస్టారెంట్లలో గ్యాస్ లేకపోవడంతో నిత్యం లక్షలాది ఆర్డర్లు కూడా స్విగ్గి జొమాటోకి తగ్గాయి. దీని వల్ల రైడర్లు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కంపెనీలకి కోట్లలో నష్టం అని బిజినెస్ అనలిస్టులు భావిస్తున్నారు.
Big Shock for Zomato and Swiggy – Losses in Crores

