పాముని చూస్తే మనం ఆమడ దూరం పారిపోతాం. మనమే కాదు అన్నీ దేశాల్లో కూడా ఇదే పరిస్దితి. అయితే కొన్ని దేశాల్లో పాముని చాలా ఇష్టంగా తింటారు అనేది తెలిసిందే. మరీ ముఖ్యంగా చైనా వారు పాములతో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు. మరి ఇంతలా తింటారు కాబట్టే అక్కడ పాముల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. అంతేకాదు మనకు ఇక్కడ కోళ్ల ఫారాలు ఉన్నట్లు అక్కడ పాములు కూడా పెంచుతారు. అయితే తినడానికి మాత్రమే కాదు అత్యంత విషపూరితమైన పాముల నుంచి విషం సేకరిస్తారు. అలాగే వాటి చర్మం కూడా కొన్ని రకాల ఖరీదైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
చైనాలో ఉన్న ఈ గ్రామం గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ గ్రామం ఏమిటి అక్కడ ఎన్ని రకాల పాములు పెంచుతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని జీసికియావో అనే గ్రామం ఉంది.. రోజూ పిల్లలు పెద్దలు ఇక్కడ వేలాది రకాల పాములతో నిత్యం జీవిస్తారు. ఇందులో విషపూరిత పాములు కూడా ఉంటాయి. పాముల పెంపకాన్ని ఒక పెద్ద వ్యాపారంగా చేస్తున్నారు ఈ గ్రామస్తులు.. 24 గంటలు పాములు బుసలతో ఈ ప్రాంతం అంతా శబ్దం వినిపిస్తుంది. బయట వారు ఈ ప్రాంతానికి రావడానికి చాలా భయపడతారు. కొందరు టూరిస్టులు చూడటానికి వచ్చినా వాటికి చాలా దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తారు.
అయితే ఈ గ్రామంలో కేవలం 980 మంది జనాభా మాత్రమే ఉంటారు. వీరిలో 50 మంది పిల్లలు ఉన్నారు. ఎవరికీ పాములు అంటే భయం ఉండదు. ఇక్కడ ఎలాంటి వ్యవసాయం చేయరు అందరూ పాములతో వ్యాపారం చేస్తారు. చిన్నతనం నుంచి పిల్లలు కూడా ఇందులో ఉండటంతో వారికి కూడా పాములని చూసినా భయం ఉండదు. దేశంలో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇన్ని పాములు పెంచినా ఒక్కరు కూడా పాము కాటుకి బలిఅవ్వలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
1980 కి ముందు ఇక్కడ ప్రజలు వ్యవసాయం చేసేవారు. పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కానీ ఒక పరిశ్రమ వారు మాకు పాములు కావాలి అని కోరడంతో ఇలా కొన్ని పాములు తీసుకువచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉంచి ఆ ఫార్మా కంపెనీకి అందించారు. ఇలా ఒక కుటుంబం నుంచి అన్నీ కుటుంబాలు కూడా ఈ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాయి. 1980 నుంచి ఇక్కడ పాముల పెంపకం ఒక కుటీర పరిశ్రమగా స్టార్ట్ అయింది. ముఖ్యంగా పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు కూడా కోబ్రా విషం, కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల కోసం వీరి నుంచి పాముల విషాన్ని సేకరిస్తున్నారు. చెప్పాలంటే ఈ గ్రామం ఆర్దిక పరిస్దితి మొత్తం మారిపోయింది. ఇక్కడ పనిచేసేవారికి సిటీలో ఎంత జీతం వస్తుందో అంత జీతం ఇస్తారు. ఉద్యోగులకి కోట్ల రూపాయల్లో ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు.
ఇక ప్రతీ ఒక్కరికి సొంత నివాసం సొంతంగా కారు కూడా ఉంది.. ఇది పోటీ లేని వ్యాపారంగా ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ఎందుకంటే ఇదివిషపూరితమైన పాములతో సావాసం వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమరపాటు ఉంటే కాటు వేస్తుందని, అందుకే చాలా మంది ఈ రంగంలోకి రావడం లేదని వ్యాపారులు తెలియచేస్తున్నారు. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల నుంచి ఈ వ్యాపారులకి డబ్బు వస్తుంది. పాము విషానికి ఎనలేని డిమాండ్ ఉంది. కంపెనీల వారు 100 శాతం అడుగుతున్నా వీరు సప్లైయ్ కేవలం 60 శాతం మాత్రమే చేస్తున్నారు.
అయితే వీటిని పెంచేందుకు చాలా మంది ముందుకు రాకపోవడం, ఉద్యోగులు లేకపోవడంతో వేరే దేశాల నుంచి కూడా చైనా కొనుగోలు చేస్తోంది.
చైనా ప్రజలు పాములని ఇష్టం గా తింటారు. ముఖ్యంగా కొన్ని రకాల పాములు ఆహారంగా తీసుకుంటారు. ఇక్కడ నుంచి వాటిని రెస్టారెంట్లు హోటల్స్ కు పంపించడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం కూడా ఈ వ్యాపారం చేయడానికి లైసెన్స్ ఇస్తుంది. మూడు నెలలు శిక్షణ కూడా తీసుకోవాలి. శిక్షణ తర్వాత ఆ సర్టిఫికెట్ తో మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విషపూరితమైన పాములతో ఉంటే కచ్చితంగా భద్రతా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.ఇక ప్రతీ పాముకి ఒక యునిక్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని పాముల నుంచి ఎంత విషం సేకరించారు ఇవన్నీ కూడా అక్కడ అధికారులకి ప్రతీ నెలా రిపార్టులు అందించాల్సి ఉంటుంది. ఇది స్నేక్ విలేజ్ స్టోరీ.
మరి ఈ స్టోరీ ఏ విధంగా అనిపించింది. ఈ స్నేక్ విలేజ్ పై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్లో తెలియచేయండి.

