HomePoliticsజీవ‌న్ రెడ్డి విలువ‌లు గ‌ల నాయ‌కుడు - ఏప్రిల్ 5 బీఆర్ఎస్ లోకి ?

జీవ‌న్ రెడ్డి విలువ‌లు గ‌ల నాయ‌కుడు – ఏప్రిల్ 5 బీఆర్ఎస్ లోకి ?

రాజ‌కీయాల్లో ఫిరాయింపుల గురించి చెబితే ఎవ‌రు త‌క్కువ కాదు ఏ స్టేట్ త‌క్కువ కాదు. ఏ పార్టీ తక్కువ‌కాదు.. తూకం అటూ ఇటూగా ఉన్న‌ట్లు ఒక‌సారి ఈ పార్టీ అయితే మ‌రో సారి ఇంకో పార్టీ. అప్పుడు తెలంగాణ ఏపీలో ఈ ఫిరాయింపుల అంశం ఎంత పొలిటిక‌ల్ హీట్ పెంచిందో చూశాం. తాజాగా తెలంగాణ‌లో మాత్రం పాపం మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి అంశం రాజ‌కీయ నాయ‌కుల‌కి కూడా బాధ క‌లుగుతుంది.

చెప్పాలంటే ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో కాంగ్రెస్ ని వ‌దిలి వెళ్ల‌డానికి ఆయ‌న‌కు మ‌న‌సు ఒప్ప‌డం లేదు, కానీ మునిగి లోతు ఎంత ఉంది చూసి చెప్పు అన్న‌ట్లు ఇంకా ఆయ‌న్ని బాధిస్తున్నారు. అందుకే ఈ క్షోభ త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డానికి సిద్దప‌డ్డారు జీవ‌న్ రెడ్డి. టాక్ ప్ర‌కారం ఏప్రిల్ 5 న గులాబీ బాస్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరే అవ‌కాశం ఉంది అని టాక్ న‌డుస్తోంది జ‌గిత్యాల‌లో.

కాంగ్రెస్ పార్టీతో ఆయ‌న‌కు మాములు సంబంధం కాదు, ఏకంగా 40 ఏళ్ల ప్ర‌స్దానం. ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ని ఇంచార్జిల‌ని చూశారు. కానీ ప్ర‌స్తుతం కాలం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల ధోర‌ణి వేరు, రాజ‌కీయంగా ఇప్పుడు మ‌నుగ‌డ కావాలి అంటే నాయ‌కులు ఎంత మంది మ‌న‌తో ఉంటే అంత మంచిది అనేది అధికార పార్టీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది అది ఏ రాష్ట్ర‌మైనా. అందుకే కొంద‌రు నాయ‌కులు కొన్ని త్యాగాల‌కు సిద్ద‌ప‌డాలి. సో మొత్తానికి జీవ‌న్ రెడ్డి ఇప్పుడు త్యాగం చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్దితి. సంజ‌య్ రాక‌తో ఆయ‌న ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండు ఏళ్లుగా న‌లుగుతున్న ఆయ‌న ఇక తెగ‌తెంపుల‌కి సిద్ద‌మ‌య్యారు.

ఆయ‌న కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం క్లారిటీ వ‌చ్చేసింది. ఈనెల 25 త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ కి గుడ్ బై చెప్ప‌నున్నారు. త‌న వెంట న‌డిచిన వారికి అంద‌రికి ఓ మాట చెప్పి వారి అభిప్రాయాలు సేక‌రించి పార్టీకి రాజీనామా చేయ‌నున్నారు. అందుకే ఈనెల 25న మీటింగ్ కి రావాలి అని త‌న అనుచ‌రుల‌ని కోరారు జీవ‌న్ రెడ్డి. త‌న‌ని న‌మ్ముకున్న వారికి కూడా ఓ మాట చెప్పాలి అనేది ఆయ‌న త‌ప‌న. పాపం జీవ‌న్ రెడ్డిని చేస్తుంటే ఆనాటి రాజ‌కీయ నాయ‌కులు కూడా బాధ‌ప‌డుతున్నారు.

ఇక ఎందుకు ఈ రాజ‌కీయం ఏ పార్టీలో లేకుండా సైలెంట్ గా ఉండ‌వ‌చ్చు క‌దా అని కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు, కానీ జీవ‌న్ రెడ్డి అలా ఉండ‌లేరు. ఇలా ఇమ‌డ‌లేక సైలెంట్ గా ఉండి రాజ‌కీయాల‌కు దూరం అవ్వ‌డానికి జీవ‌న్ రెడ్డి మ‌న‌సు అంగీక‌రించ‌దు. రాజ‌కీయాల నుంచి బ‌య‌ట‌కు వెళితే ఆయ‌న‌కు ఆయ‌న వెళ్లాలి.తెలంగాణ‌లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద మ‌నిషిగా ఆయ‌న‌కు పేరు ఉంది. ఎంతో విలువ ఇస్తారు ఆయ‌న‌కు.మ‌రి అలాంటి నాయ‌కుడు అంత ఈజీగా ఎలా నిర్ణ‌యం తీసుకుంటారు .

స్టేట్ పీసీసీ లీడ‌ర్లు ఇంచార్జ్ లు ఆయ‌న‌ని బుజ్జ‌గించారు ఆయ‌న మాత్రం ఒప్పుకోలేదు. సో 25న పార్టీకి గుడ్ బై చెప్పి ఏప్రిల్ 5న బీఆర్ఎస్ లోచేరే అవ‌కాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments