Homeవినోదండీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం

డీమన్ పవన్ ఇంట తీవ్ర విషాదం

బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు డీమ‌న్ ప‌వన్. త‌న ఆట‌తో గేమ్ లో స‌త్తా చాటాడు. ఎలాంటి టాస్క్ వ‌చ్చినా ప‌వ‌న్ ముందు ఉండేవాడు. హౌస్ లో ఉన్న స‌మ‌యంలో అత‌నికి ఫ్యామిలీ ఎంతో స‌పోర్ట్ చేసింది. ఇక అత‌ని ఫ్యామిలీ బాండింగ్ గురించి ఫ్యామిలీ వీక్ లో కూడా మ‌నం చూశాం. ఇక బ‌య‌ట‌కు వచ్చిన త‌ర్వాత వరుస అవ‌కాశాల‌తో ముందుకు వెళుతున్నాడు ప‌వ‌న్. కానీ తాజాగా ప‌వ‌న్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. డీమ‌న్ ప‌వ‌న్ తండ్రి క‌న్నుమూశారు ఇది ఆయ‌న కుటుంబానికి చేదు వార్త‌.

తండ్రి మ‌ర‌ణంతో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు ప‌వ‌న్. త‌న తండ్రి మ‌ర‌ణించారు అనే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేశారు. ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేశాడు ప‌వ‌న్ . గ‌తంలో మ‌నం షోలో కూడా చూశాం, త‌ర‌చూ త‌న తండ్రి ఆరోగ్యం అంత బాగాలేద‌ని చెప్పేవాడు. కొద్ది కాలంగా త‌న తండ్రి త్రోట్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు అని తెలియ‌చేశాడు. ఈ వార్త తెలిసి కొంద‌రు బిగ్ బాస్ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలియ‌చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ తో క‌లిగి గేమ్ ఆడిన సెల‌బ్రెటీలు కంటెస్టెంట్లు ప‌వన్ కు సానుభూతి తెలిపారు.త‌ణుకు ప‌రామ‌ర్శించేందుకు కూడా కొంద‌రు వెళుతున్నారు.

సామాన్యుల క్యాటగిరీలో అగ్నిపరీక్షలో పాల్గొన్న పవన్ అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ ఫినాలే వ‌ర‌కూ వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకున్నాడు. త‌న తండ్రి మ‌ర‌ణ వార్త ఆయ‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌చేయ‌డంతో ఈ విష‌యం బయ‌ట‌కు తెలిసింది. కొడుకు ఇప్పుడు ఎదుగుతున్న క్ర‌మంలో ఆయ‌న ఇలా దూరం అవ్వ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని అంద‌రూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అత‌ని ఆట గురించి చూస్తే హౌస్ లో త‌న టాలెంట్ తో రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ ఆఫర్ ని స‌ద్వినియోగం చేసుకుని 15 ల‌క్ష‌ల సూట్ కేస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చాడు ప‌వ‌న్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments