Homeవ్యాపారంసైన్యంలోథార్ సేవలు - మహీంద్రా ఏటీవీ

సైన్యంలోథార్ సేవలు – మహీంద్రా ఏటీవీ

సైన్యంలోథార్ సేవలు
మహీంద్రా ఏటీవీ

మహీంద్రా థార్ చాలా మందికి ఫేవ‌రెట్ కారు. ఇది ల‌గ్జ‌రీనే కాదు, ట్రావెలింగ్, లాంగ్ టూర్స్ అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఆఫ్ రోడింగ్ ప్రియుల‌కి ఇది ఫేవ‌రెట్ అని అంటారు. అయితే థార్ కారుని భార‌త సైన్యంలో ఉప‌యోగిస్తే చూడాలి అని చాలా మంది కోరిక‌. తాజాగా ఈ క‌ల నిజ‌మైంది. మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెలియ‌చేశారు.

మహీంద్రా డిఫెన్స్ విభాగం రక్షా త్రివేణి సంగమంలో ప్రదర్శించిన మహీంద్రా ఏటీవీ కి సంబంధించి ఫోటోల‌ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ వాహ‌నాన్ని ప్రాడ్ 4*4 అనే సంస్ధ స‌హ‌కారంతో బెంగ‌ళూరు సంస్ద‌తో క‌లిసి డ‌వ‌ల‌ప్ చేశారు.

ఇక ఈ వెహిక‌ల్ గురించి ఆనంద్ మ‌హీంద్రా తెలియ‌చేశారు. మీ ముందు ఉన్న‌ది మ‌హీంద్రా ఏటీవీ దీనికి ఎలాంటి హంగులు ఉండ‌వు. కేవ‌లం దీని సామ‌ర్ధ్యం మీద దృష్టిపెట్టాం. ఎలాంటి ప‌రిస్దితుల్లో అయినా ఇది నిల‌దొక్కుకుని ప్ర‌యాణం చేస్తుంది. ఎలాంటి ప‌రిస్దితిలో అయినా ముందుకు సాగుతుంది. ఇది మ‌న భ‌ద్రతా ద‌ళాల కోసం త‌యారు చేశాం. వారికి సేవ చేసే అవ‌కాశం దొరికినందుకు గ‌ర్విస్తున్నాం అని అన్నారు.

** మహీంద్రా ఏటీవీ గురించి తెలుసుకుందాం **

మహీంద్రా థార్ రాక్స్ డీజిల్ వెర్షన్‌పై ఏటీవీని నిర్మించారు.
ఇక 2.2 లీట‌ర్ల శ‌క్తివంత‌మైన ఆయిల్ బ‌ర్న‌ర్ ఇంజిన్ ఉప‌యోగిస్తారు
దీని డిజైన్ లో చాలా మార్పులు చేశారు.
వాహ‌నానికి ప్ర‌త్యేకంగా గ‌న్ మౌంట్ అలాగే వాహ‌నం కింద భాగానికి పూర్తిస్ధాయి ర‌క్ష‌ణ క‌వ‌చం ఏర్పాటు చేశారు
రాత్రిపూట ప్ర‌యాణం చేసినా శ‌త్రువుల‌కి క‌నిపించ‌కుండా బ్లాక్ అవుట్ లైట్లు పెట్టారు.
అంతేకాదు వాహ‌నాలు కారీ చేసే విమానాల నుంచి దీనిని నేరుగా పారాచూట్ సాయంతో యుద్ద క్షేత్రంలో దింప‌వ‌చ్చు.
దీనిలో స్టీల్ వీల్స్ ఉన్నాయి.
ఇక ఎలాంటి ఆఫ్ రోడ్ అయినా అద్బుతంగా ప్ర‌యాణం చేస్తుంది

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments