తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలియచేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ డ్వాక్రా మహిళలకు రుణ సౌకర్యంతో పాటు వారికి ప్రమాద బీమా కూడా అందిస్తోంది. ఒకవేళ గ్రూప్ లో సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం పై ఎంతో భారం పడుతోంది. అంతేకాకుండా ఇంకా చెల్లించాల్సిన డబ్బులు కూడా గ్రూపులో మిగిలిన వారు చెల్లించాల్సిన పరిస్దితి. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఎవరైనా ప్రమాదవశాత్తు రుణం తీసుకున్న మహిళ మరణిస్తే, ఆమె కుటుంబానికి అండగా ఉంటారు. అంతేకాదు ఆమె చెల్లించాల్సిన డ్వాక్రా రుణం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆ మహిళ కుటుంబానికి కూడా భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఒక్కో డ్వాక్రా మహిళకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. దీనికి సంబంధించి ప్రతీ ఏడాది ఆ బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఎదైనా అనుకోని ప్రమాదంలో మహిళ మరణిస్తే, ఆ రుణం కుటుంబంలోని వ్యక్తులు చెల్లించాల్సి వచ్చేది. ఆ కుటుంబం కట్టకపోతే గ్రూపులో ఉన్న మిగిలిన సభ్యులు ఆ నగదు చెల్లించేవారు. ఇది ఆర్దికంగా ఆ గ్రూపుకి కూడా భారమయ్యేది, ఒక్కోసారి ఇలా నగదు కట్టడం లేట్ అయితే ఆ గ్రూపుని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవారు.చివరకు కొత్త రుణాలు మళ్లీ పొందే అవకాశం ఉండేది కాదు. తాజాగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం వల్ల ఆకుటుంబానికి గ్రూపుకి కూడా ఆర్దిక భారం పడదు.
ప్రభుత్వ నిర్ణయంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పై మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా మహిళలు ఎవరైనా అకాల మరణం చెందితే ఆ నగదు ఇకపై ఆకుటుంబ సభ్యులు కట్టక్కర్లేదని ప్రభుత్వం బ్యాంకులకి చెల్లిస్తుందని తెలియచేశారు. డ్వాక్రా మహిళలకు 10లక్షల వరకూ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 231 క్లెయిమ్స్ పరిష్కరించామన్నారు, రానున్న రోజుల్లో మహిళలకు మరింత తోడ్పాటు అందించే పథకాలు అమలు చేస్తామన్నారు.

