Homeవినోదంద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్దానం మారిందా - వార‌ణాసి లెక్క‌లు మారుస్తుందా

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్దానం మారిందా – వార‌ణాసి లెక్క‌లు మారుస్తుందా

బాహుబ‌లి ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమాల‌తో దేశంలో టాప్ ద‌ర్శ‌కుడు అంటే వెంట‌నే మ‌నం చెప్పే మాట ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు అద్బుతాలు అని చెప్పాలి. మేకింగ్ లో కింగ్ అనే బిరుదు వచ్చింది సినిమాల్లో. ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్లో కూడా ఇండియ‌న్ సినిమా అంటే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అనేలా పేరు నిల‌బ‌డింది. మ‌నం హాలీవుడ్ లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ పేరు ఎలా పిలుస్తామో అక్కడ వారు కూడా మ‌న రాజ‌మౌళిని ఆ స్ధాయికి పెట్టారు. అయితే సినిమా సినిమాకి కొత్తథ‌నం టేకింగ్ లో స‌రికొత్త విధానం రాజ‌మౌళి సినిమాల్లో క‌నిపిస్తూ ఉంటాయి.

అయితే రాజమౌళి ప్లేస్ ఇప్పుడు ఇండియాలో నెంబ‌ర్ 2 కి వ‌చ్చింది అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణాలు ఉన్నాయి.ఎందుకంటే వ‌సూళ్ల ప‌రంగా బాహుబ‌లి సినిమాతో పోటి ప‌డుతూ దురంధ‌ర్ వ‌సూళ్లు వ‌చ్చాయి, వ‌సూళ్ల గురించి ప‌క్క‌న పెడితే ముందు స్టోరీ నేరేష‌న్ డీటెయిలింగ్ విష‌యంలో థురంధ‌ర్ 2 అంద‌రికి బాగా న‌చ్చింది. వ‌సూల్లు గురించి చూస్తే పుష్ప 2 కూడా ఒక‌ రేంజ్ వ‌సూళ్లు తెచ్చింది, ఎక్క‌డైనా డైరెక్ట‌ర్ అంటే వ‌సూళ్లు కాదు క‌దా, క‌థ టేకింగ్ . సో ముఖ్యంగా ఇప్పుడు యంగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పేరు అందుకే మార్మోగిపోతోంది. ఈక‌థ ఎంచుకోవ‌డం ఆయ‌న స‌క్సెస్ అనే చెప్పాలి.

ఇక వ‌సూళ్ల ప‌రంగా కూడా బాహుబ‌లి సినిమాని దాటింది. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కులు టేకింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. యూత్ ప్ర‌తీది అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. నాటి సినిమా స్టైల్ వేరు, నేటి సినిమా స్టైల్ వేరు. చిన్న మ్యూజిక్ బిట్ కాపీ వ‌చ్చినా ఇట్టే ప‌సిగ‌ట్టేస్తున్నారు ఇప్ప‌టి యువ‌త‌. అందుకే ఆధిత్య‌ధ‌ర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని ధురంధ‌ర్ స్టోరీ తెర‌కెక్కించారు. ఇప్పుడు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి పొజిష‌న్ 2 అని కొంత మంది అన్నా ముందు రోజుల్లో వార‌ణాసి సినిమా రానుంది.

ఈ చిత్రం సుమారు 100 దేశాల‌కు పైగా విడుద‌ల కానుంది, ఇది ఎలాంటి చ‌రిత్ర క్రియేట్ చేస్తుందో చూడాలి. మ‌హేష్ బాబు కూడా హాలీవుడ్ రేంజ్ యాక్ట‌ర్, సో అందుకే ఈ సినిమా విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్ర‌జ‌ల ముందుకు తీసుకువ‌స్తున్నారు జ‌క్క‌న్న‌.. రాజ‌మౌళి సినిమా వ‌స్తోంది అంటేనే ఎన్నో ఎక్స‌పెక్టేష‌న్స్ ఉంటాయి అభిమానుల‌కి. వాటిని మ‌రింత దాటాలి అని ప్ర‌తీ సినిమాకి ఫ్యాన్స్ కోరుకుంటారు. సో అందుకే ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఇక్క‌డ నెంబ‌ర్ అనేది పెద్ద మేట‌ర్ కాదు, రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రికార్డులు మ‌రో 10 ఏళ్ల వ‌ర‌కూ సాలిడ్ గా నిలుస్తాయి అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments