ఈ రోజు ఇలా ఉంది రేపు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు ఇదే టాపిక్ గురించి చర్చ సాగుతోంది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ఒకటి ఇస్తున్నాయి, కానీ పలు కారణాల వల్ల ఆ డేట్ ని మార్చుకుంటున్నాయి. వారికి అనుకూలమైన సమయాలు చూసుకుని రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ చిన్న సినిమాలు ఈమధ్యలో నలిగిపోతున్నాయి. దాదాపు 100 సినిమాల్లో 50 సినిమాలు అయినా అనుకున్న సమయానికి రావడం లేదు. దీని వల్ల ముందుగా ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు కూడా వెనక్కి వెళ్లవలసి వస్తున్నాయి.
ఎక్కువగా టాలీవుడ్ లో ఈ కల్చర్ బాగా కనిపిస్తోంది. అయితే తాజాగా పెద్ది సినిమా రిలీజ్ డేట్ ముందు వచ్చేసింది. అయితే రామ్ చరణ్ కి గాయం అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ మరింత లేట్ అవుతుంది అని వార్తలు వినిపించాయి. ఇక మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగిలిన సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్ విషయంలో డైలమాలో ఉన్నాయి.
ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. మరోసారి సినిమా వాయిదా అంటూ వార్తలు రావడంతో , సమ్మర్ లో ఈ సినిమా వస్తుందా, లేదా సమ్మర్ ముగిసిన తర్వాత వస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. సంక్రాంతి, సమ్మర్ దసరా, ఇవే పెద్ద సినిమాలకు మంచి సమయాలు. మరిపెద్ది మేకర్స్ ఆలోచన ఎలా ఉంది అనేది టాలీవుడ్ లో చర్చ సాగుతోంది.
ఎస్కేఎన్ లాంటి నిర్మాత పెద్ది వాయిదా పడినట్టు ఏకంగా కొత్త రిలీజ్ డేట్ నిండు సభలో చెప్పేశాడు. చివరకు క్లారిటీ ఇచ్చినా ఆ డేట్ ఆ వాయిస్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు ఉన్నాయి కాస్త పాచ్ వర్క్ పెండింగ్ ఉంది. ఇది పెద్ద విషయం కాదు. ఈజీగా రెండు మూడు రోజుల్లో ఈ పాటలు పూర్తి అవుతాయి. మరి ఎడిటింగ్ వర్క్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో వేగంగా జరుగుతోంది. మరి బజ్ ఇంత ఉన్న సమయంలో సినిమా ఆలస్యం అయితే మిగిలిన సినిమాలకు డేట్స్ క్లాష్ అవుతాయి అని చర్చ సాగుతోంది ఇండస్ట్రీలో. పెద్ద సినిమా కావడంతో రిలీజ్ డేట్ గురించి చిన్న సినిమాల వారు ప్రశ్నించలేరు, మరి చూడాలి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో.
.

