టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అడపా దడపా సినిమాల్లో నటించినా మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు. మంచిగా భర్తతో జీవితం సాగిపోతుంది అనుకుంటున్న వేళ, ఆమెకి సంబంధించిన ఓ వార్త అందరిని షాక్ కి గురిచేస్తోంది. తన భర్త సోహైల్ కతూరియాతో ఆమె విడాకులు తీసుకున్నారు అనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి కుటుంబ కలహాలతో వారు విడిపోయారు అని బాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు కొంతకాలంగా ఆమె తన భర్తతో కూడా కలిసి ఉండటం లేదని, తన తల్లితో కలిసి ఉంటోంది అని అంటున్నారు. ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను మంజూరుచేసినట్లు తెలుస్తోంది. హన్సికకు డిసెంబర్ 4, 2022న సోహైల్ కతూరియాతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఎంతో అందంగా చూడచక్కని జంట అని అందరూ భావించారు. అంతేకాదు గతంలో కతూరియాకి వివాహం కూడా అయింది తర్వాత విడాకులు అయ్యాయి. కొన్నాళ్లకు హన్సికని రెండో వివాహం చేసుకున్నాడు.
ముందు కతూరియా హన్సిక ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ఆమె కూడా హాజరయింది. అయితే వారిద్దరు కొంత కాలం తర్వాత విడిపోయారు. ఆ తర్వాత కతూరియాతో ప్రేమలో పడింది హన్సిక. తనకు గతం అంతా తెలిసి అతన్ని వివాహం చేసుకున్నాను అని, వారు విడిపోవడానికి నేను కారణం కాదని ట్రోల్స్ కి కూడా గట్టిగా సమాధానం చెప్పింది. దాదాపు ఆరు నెలలుగా ఈ జంట ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. ఇక ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలు వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు అతని పేరును కూడా ఆమె తొలగించింది. తాజాగా విడాకులు మంజూరు కావడంతో ఈ వార్త ఇప్పుడు హైలెట్ అయింది.
అయితే ఇంత అన్యోన్యమైన జంట ఎందుకు విడిపోయారు అనేదానికి కారణాలు తెలియవు. వివాహం అయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే ఇలా వార్తలు వస్తున్న వేళ ఈ జంటలో ఎవరూ కూడా స్పందించలేదు. గతంలో ఇలాంటి రూమర్స్ వచ్చిన వెంటనే హన్సిక స్పందించారు. తాజాగా హన్సిక ఈ వార్తలపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

