మన ప్రపంచంలో అతి పెద్ద అడవి అంటే టక్కున అందరూ చెప్పేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇది ఎంత సుందరమైన ప్రాంతమో తెలిసిందే. అనేక వృక్షాలు జంతువులు ఇక్కడ ఉంటాయి. మనకు తెలియని అనేక జంతువులకు నిలయం అమెజాన్. ఇక మన ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ ఇక్కడ చెట్ల నుంచి వస్తుంది. ఇప్పటి వరకూ అమెజాన్ ఫారెస్ట్ మొత్తం చుట్టి వచ్చిన వ్యక్తి లేరు. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున వాయి కాలుష్యం జరుగుతున్నా గ్లోబల్ వార్మింగ్ నుంచి అమెజాన్ ఫారెస్ట్ మనల్ని కాపాడుతోంది. ఒక్క మాటలో ప్రపంచ దేశాలు ఈ అమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. మరి అలాంటి అమెజాన్ అడవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ అడవిలో కొన్ని వందల సంవత్సరాలుగా ఉష్ణోగ్రత సమానంగానే ఉంటోది కాని ఎన్నడూ పెరగదు.
2. ఇక్కడ ప్రవహించే కొన్ని సెలయేర్లలో నీరు అత్యంత ఎక్కువ పీహెచ్ కలిగి ఉంటుంది.
3. ఈ అడవిలో వర్షపు చినుకులు సాధారణ వర్షపు చినుకుల కంటే ఎంతో ఫ్యూరిటీ కలిగి ఉంటాయి
4.ప్రపంచంలో ఇంత పెద్ద అడవి మరొకటి లేదు, ఎందుకంటే మొత్తం అమెజాన్ అడవి 70 లక్షల చదరపు కిలోమీటర్లు అందే 19 చిన్న దేశాలతో సమానం.
5. ఈ అడవి ఎప్పుడు ఏర్పడింది అనేది చూస్తే సుమారు 5.6 కోట్ల సంవత్సరాల క్రితం జీవ వైవిద్యానికి నెలవుగా ఈ అడవి పుట్టింది

6. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఓ ఆస్టరాయిడ్ ఇక్కడ పడటంతో ఈ అడవి ఏర్పడింది అనేది శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
7. ఇప్పటీకీ ఇక్కడ 5000 జీవుల గురించి పరిశోధన జరుగుతోంది. సుమారు 60 వేల మొక్కల గురించి పరిశోధన జరుగుతోంది ఇక్కడ ఉన్న కొన్ని రకాల జీవులు ప్రపంచంలో మరెక్కడా లేవు, అలాగే ఈ మొక్కలు కూడా కొన్ని భూమి మీద ఎక్కడా కనిపించవు.
8. అమెజాన్ ఫారెస్ట్ కి మరో ముఖ్యమైన గుర్తింపు ఏమిటి అంటే మన ప్రపంచంలో విడుదల అయ్యే ఆక్సిజన్ లో 20 శాతం ఈ రెయిన్ ఫారెస్ట్ నుంచి విడుదల అవుతుంది.
9. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మొక్కలు వృక్షాలు నెలవు అవ్వడానికి కారణం పుష్కలంగా నీరు ఉండటం. ఇక్కడ అమెజాన్ నది ప్రవహిస్తోంది ఇది ప్రపంచంలో రెండో అతి పెద్ద నది.
10. ఈ అమెజాన్ అడవులు సౌత్ అమెరికా అంతటా విస్తరించి ఉన్నాయి. అలాగే 60 శాతం బ్రెజిల్ లో కూడా ఉంది ఈ ఫారెస్ట్

11. ఇక్కడ ఆరు ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మొత్తం దట్టమైన చీకటి అలుముకుంటుంది. ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి కేవలం 2 శాతం మాత్రమే వస్తుంది. ఇక్కడ మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫువ్వు, సుగంద ద్రవ్యాలు, మూలికలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి 60 శాతం లభిస్తున్నాయి.
12. మొత్తం అమెజాన్ అడవుల్లో 652 ఆటవిక జాతులు ఉన్నాయి. ఎవరి ఆచారాలు వారివే. అయితే వారు ఆ అడవి దాటి బయటకు రారు. అక్కడ దొరికే ఆహారమే వారికి సరిపోతుంది. ఇక బయట మనుషులు ఎలా ఉంటారో కూడా సగం జాతుల వారికి తెలియదు.
13 కోవర్ అనే జాతి ఇక్కడ అత్యంత ప్రమాదకరం. వీరు మనుషుల్ని కూడా తింటారు. ఇక మొత్తం అమెజాన్ లో 395 బిలియన్ చెట్లు ఉన్నాయి. 5500 రకాల చేప జాతులు ఉన్నాయి. అమెజాన్ లో ఉండే మొసళ్లు మరెక్కడా కూడా కనిపించవు. ఇక్కడ ఉండే క్రూర జంతువులు మన భూమి మీద ఎక్కడా కనిపించవు.
14. మనం సినిమాల్లో చూసే అనకొండ అనే పాము కూడా అమెజాన్ ఫారెస్ట్ లోనే పుట్టింది. ఇక్కడ 30 నుంచి 50 అడుగుల పొడవు ఉండే పాములు ఉంటాయి . వాటిని అనకొండలుగా పిలుస్తారు అవి ఎట్టి పరిస్దితుల్లో ఫారెస్ట్ దాటి రావు.
15. విషపు చేపలు, విషపు కప్పలు, ఈల్ చేపలు, పిరాన్హాలు, మనకు తెలియని అనేక నదీ జీవరాశులు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు విషపూరిత కోతులు ప్రపంచంలో ఎక్కడా ఉండవు కానీ అమెజాన్ లో మాత్రమే కనిపిస్తాయి.

16.. ఇక్కడ వాటర్ లిల్లీ అనే ఆకులు ప్రపంచంలో అతి పెద్ద ఆకులు. ఒక ఆకులో ఏకంగా 50 మంది కూర్చొని భోజనం చేయవచ్చు .ఈ ఒక్క ఆకు 50 కేజీల బరువు మోయగలదు.
17.టౌకెన్ అనే పక్షి ప్రపంచంతో అతి పెద్దగా సౌండ్ చేస్తుంది. కిలోమీటర్ వరకూ ఈ సౌండ్ వినిపిస్తుంది.
18…ఇక్విటోస్ అనే నగరం కాస్త మోడ్రన్ సిటీ అమెజాన్ కి దగ్గరగా ఉంది. అయితే వీరు ఫారెస్ట్ లోకి వెళ్లడం ఈజీ,
కాని లోపలికి వెళ్లే సాహసం చేయరు. సుమారు 2 లక్షల మంది జనాభా ఈ నగరంలో ఉంటారు. అత్యంత క్వాలిటీ ఎయిర్ ఈ సిటికి అమెజాన్ అందిస్తోంది. ఇక్కడ ఫారెస్ట్ దగ్గర ఉండటంతో 200 రోజులు పైగానే భారీ వర్షాలు కురుస్తాయి.
19.. అమెజాన్ నదిలో క్రూయి అనే తాబేళ్లు ఉంటాయి. ఇవి కూడా వాటి కన్నీటిని తాగుతాయి. ఎక్కడా లేని రేర్ తాబేళ్లు అనే చెప్పాలి. 15 ఏళ్లుగా వీటి మనుగడ అక్కడ ప్రశ్నార్ధకం అయింది. కొన్ని జంతువులు వీటిని ఆహారం చేసుకుంటున్నాయి వీటి సంఖ్య అందుకే క్రమంగా తగ్గుతోంది.
20..ఇక్కడ మొత్తం 9 లక్షల కీటకాలు ఉన్నాయి అని ప్రాధమిక అంచనా ఇంకా చాలా ప్రాంతం జల్లెడ పట్టాల్సి ఉంది.

21. ఈ ఫారెస్ట్ మొత్తం వైశాల్యంగా పరిశీలిస్తే, బ్రిటన్ ఐర్లాండ్ ఈ దేశాలు 17 సార్లు ఏర్పాటు చేయవచ్చు.
22. ఇక ఈ అడవి చూసుకుంటే బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా సరిహద్దులుగా ఉన్నాయి. వీరెవ్వరు కూడా ఈ లోపలకు వెళ్లేందుకు సాహసంచేయరు. మేజర్ పార్ట్ 60 శాతం బ్రెజిల్ లోనే ఉంది.
23. అమెజాన్ నది 6900 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే అంతర్జాతీయ స్విమ్మర్ ఈనదిని 68 రోజుల పాటు ఈదాడు ఇది గిన్నీస్ రికార్డ్.

