Homeఅంతర్జాతీయ16,000 కోట్ల ఆర్సీబీ య‌జ‌మాని ఆర్యమన్ బిర్లా ఎవరు రియ‌ల్ స్టోరీ

16,000 కోట్ల ఆర్సీబీ య‌జ‌మాని ఆర్యమన్ బిర్లా ఎవరు రియ‌ల్ స్టోరీ

 

నాడు ఐపీఎల్ ప్లేయ‌ర్ – నేడు RCB ఓన‌ర్

16,000 కోట్ల ఆర్సీబీ య‌జ‌మాని ఆర్యమన్ బిర్లా ఎవరు రియ‌ల్ స్టోరీ

తాజాగా ఈఐపీఎల్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది . మ‌రో నాలుగు రోజుల్లో సీజ‌న్ ప్రారంభం అవుతుంది అన‌గా ఆర్సీబీ యాజ‌మాన్యం చేతులు మారింది. గ‌త రెండు నెల‌ల నుంచి దీనిపై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మొత్తానికి సీజ‌న్ ప్రారంభానికి ముందే ఈ యాజ‌మాన్యం చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూపు నేతృత్వంలోని క‌న్సార్జియం ఈ డీల్ చేసుకుంది. సుమారు 16000 కోట్ల రూపాయ‌ల‌కు ఈ ఫ్రాంచైజీ ని కోనుగోలు చేసింది. ఇక ఈ కొత్త యాజ‌మాన్యం చేతులు మారాక ఆదిత్య బిర్లా గ్రూపు పెద్ద షేర్ హోల్డ‌ర్ గా నిలిచింది. ఇక జ‌ట్టు బాధ్య‌త‌లు కుమార మంగ‌ళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా చేప‌ట్టనున్నారు..

**కుమార మంగ‌ళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ఎవ‌రు అనేది చూస్తే**

ఆర్యమన్ బిర్లా వ‌య‌సు 28 సంవ‌త్స‌రాలు భార‌త్ లో పుట్టిన ఆర్య‌మ‌న్ బిర్లా.. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.. ఆ తర్వాత బేయర్స్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి గ్లోబల్‌ ఫైనాన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్ర‌స్తుతం తన‌ తండ్రి కంపెనీల్లో డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నారు.

పారిశ్రామిక వేత్త‌గానే కాదు ఆయ‌న‌కంటూ క్రికెట్ లో కూడా ఎంతో అనుభ‌వం ఉంది. గ‌తంలో ఆయ‌న ఐపీఎల్ లో జ‌ట్టు స‌భ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా మాజీ క్రికెటర్ కూడా. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ప్లేయ‌ర్ గా ఆడారు. ఇక చిన్న‌త‌నం నుంచి క్రికెటర్ అవ్వాలి అనే కోరిక‌తో ఆయ‌న క్రికెట్ లో అడుగు పెట్టారు.ఉన్న‌త చ‌దువులు పూర్తి చేసిన త‌ర్వాత ఇలా క్రీడారంగంలోకి వ‌చ్చాడు .ప్ర‌స్తుతం త‌న తండ్రి ఈ జ‌ట్టు యజ‌మానిగా మారారు దీంతో ఈ జ‌ట్టు బాధ్య‌త‌ల‌ని కుమారుడికి అప్ప‌గించారు.

ఇక ఆర్సీబీని కొనుగోలు చేసిన వారిలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్, అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ఇలా అంద‌రూ భాగ‌స్వాములుగా కొనుగోలు చేశారు.. మొత్తం ఆర్సీబీలో ఉన్న 100 శాతం వాటాని వీరే కొనుగోలు చేశారు..

ఆర్యమన్ బిర్లా దేశవాళీ క్రికెట్ లో రాణించారు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటారు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యమన్.. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు చేశారు. అంతేకాదు కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో బెంగాల్ పై సెంచ‌రీ కూడా చేశాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ వెంక‌టేష్ అయ్య‌ర్ తో క‌లిసి ఆడిన అనుభ‌వం కూడా ఉంది. డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు గ‌తంలో.

ఇక 2018లో ఐపీఎల్ మెగా వేలంలో రాజ‌స్దాన్ జ‌ట్టు ఆర్య‌మ‌న్ ని 30 ల‌క్ష‌ల కు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజ‌న్ లో ఒక్క మ్యాచ్ ఆడేందుకు కూడా అవ‌కాశం రాలేదు. 2020 సీజ‌న్ కి ముందు అత‌న్ని జ‌ట్టు నుంచి విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత కాస్త మానసిక ఆరోగ్యం గురించి క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్ర‌క‌టించారు. దీనిపై సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. త‌ర్వాత దేశవాళీ క్రికెట్ లో కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌ర్వాత త‌న తండ్రి కంపెనీలో డైరెక్ట‌ర్ గా కొన‌సాగారు బిజినెస్ లో బిజీ అయ్యారు.

ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ లో సిందాల్కో, గ్రాసింగ్ లాంటి పెద్ద సంస్థలకు డైరెక్టర్ గా కూడా ఉన్నారు.
ఆర్యమన్ బిర్లా ఆస్తి సుమారు ల‌క్షా 75 వేల కోట్ల రూపాయ‌లు ఉంటుంది అంటారు. ఆ కంపెనీల‌కి వార‌సుడు అత‌నే. సో గ‌తంలో ఐపీఎల్ ఆట‌గాడిగా ఉన్న ఆర్యమన్ బిర్లా, ఇప్పుడు ఓ జ‌ట్టుకు య‌జ‌మానికి మారారు. మ‌రి చూడాలి ఈ సీజ‌న్ లో ఆయ‌న జ‌ట్టు ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందో.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments