ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యం మనం సొంతం. అయితే ఆకుకూరలు కూడా ఇటీవల సరిగ్గా ఉండటం లేదని వాటిపై మందులు చల్లడం వల్ల, వాటి వల్ల వచ్చే పోషకాలు దూరం అవుతున్నాయంటున్నారు వైద్యులు. అంతేకాదు వీటిని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కూడా ఆకుకూరల్లో పోషకాలు దూరం అవుతాయి అనేది గుర్తు ఉంచుకోండి. అయితే ఆకుకూరలు కొనే సమయంలో వాటిని స్టోర్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వండే వంటల్లో కూడా వీటిని సరైన విధంగా వండాలి. లేదంటే పోషకాలు అందకుండా బయటకు పోతాయి అని తెలియచేస్తున్నారు.
ఆకుకూరలు తెచ్చిన వెంటనే వాటిని వండుకు తింటే మంచిది. మొత్తని ఉప్పు ఒక చెంచాడు తీసుకుని వాటర్ లో కలిపి ఆ వాటర్ తో ఈ ఆకుకూరలు కడగాలి. కాడల దగ్గర ఉన్న మట్టి ఇసుక మొత్తం పోయేలా చూసుకోవాలి. ఒకటికి నాలుగు సార్లు కడిగి ఈ ఆకుకూరలు కట్ చేయడం మంచిది. అలాగే చుక్కకూర, పాలకూర, మెంతికూర విషయంలో ఎక్కువ రోజులు నిల్వ ఉంటే, అన్ని పోషకాలు దూరం అవుతాయి. వీటిని మార్కెట్ నుంచి తీసుకువచ్చిన 24 గంటల్లో వండుకోవడం మంచిది.
ఇక గోంగూర, తోటకూర, పునగంటి కూర, కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకువచ్చిన 48 గంటల వరకూ వాడుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్ లో కంటే బయట వీటిని ఉంచి వండుకోవడం మంచిది. ఇక ఆకుకూరలు ఉడికించిన వాటర్ ని కూరల్లో పప్పుల్లో వేసుకోవాలి. ఆనీటిని పారబోస్తే ఆ పోషకాలు అన్నీ నీటి ద్వారా బయటకు పోతాయి. మీరు ఆహారం వండేదానిబట్టి పోషకాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి . ఇక ఎట్టిపరిస్దితుల్లో మీరు ఆకుకూరలు వేడి నీటిలో మాత్రం కడగవద్దు. కచ్చితంగా చల్లని నీటిని ఉప్పుని మాత్రమే వాడండి, బేకింగ్ సోడాతో కడిగినా కచ్చితంగా మళ్లీ సాధారణ వాటర్ తో ఆకుని శుభ్రం చేయండి.
ఇక ఫ్రిడ్జ్ లో ఆకుకూరలు పెట్టాలి అని భావిస్తే, కచ్చితంగా మీరు పలుచని నెట్ లో ఈ ఆకుకూరలు పెట్టాల్సి ఉంటుంది. ఆ నెట్ బ్యాగ్ ఫ్రిడ్జ్ లోపెట్టడం వల్ల తేమ ఉండి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఎట్టి పరిస్దితిలో ఫ్రిడ్జ్ లో ఆకుకూరలు నేరుగా పెట్టకూడదు. ఎందుకంటే చిన్న చిన్న లార్వాలు పురుగులు ఫ్రిడ్జ్ లో ఉన్న వేరే ఆహారపదార్దాల్లో చేరే అవకాశం ఉంటుంది. అందుకే నేరుగా ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇక ఎలాంటి కెమికల్స్ కూడా ఆకుకూరలు కడిగేందుకు ఉపయోగించవద్దు. ఇది శరీరంపై ఇంపాక్ట్ చూపిస్తుంది. పేగులకి జీర్ణ వ్యవస్దకి ఆ కెమికల్స్ చేటు చేస్తాయి. పోషకాలు ఎలా ఉన్నా కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి అనేది గుర్తుంచుకోండి.

