Homeతెలంగాణయూట్యూబర్ వైష్ణవి హ‌త్య కేసులో బ‌య‌ట‌ప‌డుతున్న షాకింగ్ నిజాలు

యూట్యూబర్ వైష్ణవి హ‌త్య కేసులో బ‌య‌ట‌ప‌డుతున్న షాకింగ్ నిజాలు

యూట్యూబర్ వైష్ణవి అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. భ‌ర్త చేతుల్లో ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. యావ‌త్ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ వార్త విని క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నాయి. కోరుట్లలోని మాదాపూర్‌ గ్రామానికి చెందిన వైష్ణవి ఆమె వ‌య‌సు 19 సంవ‌త్స‌రాలు ఆమెకి చిత్త‌రి హ‌రిబాబుతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మార‌డంతో గ‌త ఏడాది వివాహం చేసుకున్నారు. అంద‌మైన జంట, కొద్దికాలం వీరి కాపురం బాగానే ఉంది. ప్ర‌స్తుతం ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి.

మాదాపూర్‌లోని అత్తింట్లో నివాసం ఉంటున్నారు. త‌న‌కు సంబంధించి అన్ని విష‌యాలు కూడా త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వైష్ణ‌వి అభిమానుల‌కి తెలియ‌చేస్తుంది. అంతేకాకుండా భార్య భ‌ర్త ఇద్ద‌రు ప్రాంక్ వీడియోలు కూడా చేసేవారు. ఈ జంట‌ని చూసి అంద‌రూ చాలా బాగున్నారు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకునేవారు. అయితే హ‌రిబాబు వైష్ణ‌విని పెళ్లి చేసుకున్న రెండు నెల‌ల త‌ర్వాత నుంచి టార్చ‌ర్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.. చివ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య ఈ విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భిణి అని కూడా చూడ‌కుండా ఆమె గొంతు నులిమి, చేతులు నుదిటిపై క‌త్తితో పొడిచి చంపేశాడు. త‌ర్వాత బైక్ పై హ‌రిబాబు పారిపోయాడు. ఆదివారం ఎంత సేపు అయినా వైష్ణ‌వి ఇంటి గ‌ది నుంచి బ‌య‌ట‌కు రాలేదు చివ‌ర‌కు అనుమానం వ‌చ్చి కుటుంబ స‌భ్యులు చూస్తే ఆమె విగ‌త‌జీవిగా ప‌డి ఉంది. వెంట‌నే పోలీసుల‌కి స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ ఫాలోవ‌ర్స్ ఈ వార్త విని ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. ఆమె లేదు అనే వార్త జీర్ణించుకోలేక‌పోతున్నాము అంటున్నారు. అంతేకాదు ఆమె తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు పోలీసులు. వ‌ర‌క‌ట్న వేధింపులు ఆమెకు ఇటీవ‌ల పెరిగాయని తండ్రి కూడా పోలీసుల‌కి తెలియ‌చేశారు.

వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుండి ఆమెని అబార్ష‌న్ చేయించుకోవాలి అని హ‌రిబాబు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువ‌స్తున్నాడని అంటున్నారు. దీనిపై గ‌తంలో పంచాయ‌తీ జ‌రిగిందని. అప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఒత్తిడి పెరిగింది అని అంటున్నారు. క‌చ్చితంగా హ‌రిబాబుపై చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఇలాంటి వాడికి ఉరిశిక్ష క‌రెక్ట్ అని కోరుతున్నారు. ఇలాంటి వ్య‌క్తిని వైష్ణ‌వి వ‌దిలేసి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయినా ఆమె ప్రాణాలు ద‌క్కేవి అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments