ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా త్రిష విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో విజయ్ తన భార్యకి విడాకులు ఇస్తారని ఆ తర్వాత త్రిషతో ఆయన వివాహం జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా తమిళనాడు ఎన్నికల తర్వాత మాత్రమే జరుగుతుంది అని అంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విజయ్ కుటుంబంలో దీనిపై గొడవలు జరుగుతున్నాయి.
అయితే సామరస్యపూర్వకంగా ఈ వివాదం ముగించడానికి విజయ్ భార్య సంగీత ఒప్పుకోలేదు. కరెక్టుగా ఎన్నికల ముందు విజయ్ గురించి అందరికి తెలియాలి అని ఆమె కోర్టుని ఆశ్రయించారు. దీనిపై విజయ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక భార్యతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. పిల్లల విషయం కూడా భార్యకే వదిలేయనున్నారు అని తెలుస్తోంది. ఇక కుమారుడు కూడా తండ్రితో కొద్ది రోజులుగా దూరంగానే ఉంటున్నారు.
అయితే ఓ పక్క కుటుంబం గురించి ఇలాంటి వార్తలు వస్తున్న వేళ, త్రిష విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఏఐ జనరేటెడ్ వీడియో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ త్రిష పెళ్లి పీటలపై కూర్చున్నట్టు సినిమా రాజకీయ సెలబ్రెటీలు హాజరు అవుతున్నట్లు ఫోటోలు వీడియోలు వదిలారు. అయితే ఈ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. ఈ లైక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంటే త్రిష కుటుంబానికి ఈ విషయం తెలుసని లీగల్ గా భార్యతో విడిపోయిన తర్వాత వీరిద్దరు వివాహం చేసుకుంటారు అనేదానికి ఓ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆమె లైక్ కొట్టడంతో వీరి పెళ్లికి త్రిష కుటుంబం కూడా అంగీకారం తెలిపారు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. విజయ్ తన అభిమాని సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరికి వివాహం జరిగింది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
కుమారుడు సంజయ్ కుతురు దివ్య. ఇక ప్రస్తుతం ఇద్దరు చదువుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఓ నటితో తన భర్త సీక్రెట్ అఫైర్ నడుపుతున్నారని, ఆయన తనకు మాట ఇచ్చి దానిని వమ్ముచేశారని, భర్తపై నమ్మకం లేదని, తన భర్తతో తనకు విడాకులు ఇప్పించాలి అని కోర్టులో కేసు వేశారు సంగీత. దీనిపై ఏప్రిల్ నెలలో విజయ్ కోర్టుకి హాజరు కానున్నారు. సోమొత్తానికి త్రిష విజయ్ పై ఇలాంటి రూమర్స్ వస్తున్న వేళ ఇద్దరూ కూడా దీనిపై స్పందించలేదు.

