Homeవినోదంసినిమాలకు త్రిష గుడ్ బై - విజయ్ వెంట న‌డుస్తారా

సినిమాలకు త్రిష గుడ్ బై – విజయ్ వెంట న‌డుస్తారా

సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో అంద‌రు స్టార్ హీరోల‌తో న‌టించిన ముద్దుగుమ్మ త్రిష‌. సౌత్ లో ఉన్న అన్నీ ఇండ‌స్ట్రీలో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, భాష‌ల్లో అనేక హిట్ చిత్రాల్లో న‌టించింది. మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.ఆమె ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవితో విశ్వంభ‌ర సినిమా చేస్తున్నారు. అలాగే త‌మిళ్ లో ఆమె క‌రుప్పు సినిమా చేస్తున్నారు. ఇక విజ‌య్ సేతుప‌తితో 96 సీక్వెల్ లో కూడా ఆమె న‌టిస్తోంది.

అయితే త‌మిళ‌నాట ఇప్పుడు త్రిష పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే విజ‌య్ భార్య సంగీత అత‌ని నుంచి విడాకులు కావాలి అని కోర‌డంతో ఆమె పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. విజ‌య్ తో త్రిష‌కు రిలేష‌న్ ఉంద‌ని అందుకే ఈ జంట విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇద్ద‌రు కూడా స్పందించ‌డం లేదు.
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం ఇప్ప‌టికే కోర్టులో పిటీష‌న్ వేశారు. ఇక వ‌చ్చే నెల‌లో విజయ్ కోర్టుకి హాజ‌రుకావాల్సి ఉంటుంది. చాలా మంది ఈ జంట విడాకుల‌కి ప్ర‌ధాన కార‌ణం త్రిష అంటూ ఆమెని విమ‌ర్శిస్తున్నారు.

ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తున్న వేళ ఇటీవ‌ల ఓ వ్యాపార‌వేత్త కొడుకు పెళ్లికి త్రిష విజ‌య్ క‌లిసి వెళ్ల‌డంతో, ఈ వార్త‌ల‌కు ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. గ‌త ఐదారు సంవ‌త్స‌రాలుగా వీరిద్ద‌రు రిలేష‌న్ లో ఉన్నార‌ని గాసిప్స్ వినిపించాయి. ఇక గ‌తంలో త్రిష కూడా ఓ వ్య‌క్తిని ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కానీ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే తాజాగా త్రిష గురించి మ‌రో వార్త వినిపిస్తోంది. త్రిష ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నార‌ట‌.

ప్రస్తుతం ఆమె ఒకే చేసిన సినిమాలు అన్నీ పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. కొత్త సినిమాలు ఒకే చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆమెకి ఓ క‌థ చెప్ప‌డానికి వెళ్లారు. ఆమె క‌థ కూడా విన‌లేద‌ట‌, ప్ర‌స్తుతం ఎలాంటి సినిమాలు ఆమె ఒకే చేయ‌డం లేద‌ని కోలీవుడ్ టాక్..

విజ‌య్ ఇప్ప‌టికే సినిమాల‌కు గుడ్ బై చెప్పారు. పూర్తి స్దాయి రాజ‌కీయాల్లో ఉంటాను అని చెప్పారు. ఇక త్రిష కూడా సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకి రాజ‌కీయాలు అంటే ఇంట్ర‌స్ట్, గ‌తంలో కూడా ఆమె దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. త‌న‌కు సీఎం కావాల‌నే కోరిక ఉంద‌ని తెలిపారు. మొత్తానికి విజయ్ స్ధాపించిన పార్టీలో ఆమె చేరుతారు అనే వార్త‌లు త‌మిళ‌నాట బాగా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments