తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఆటో డ్రైవర్ల విషయంలో ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ హితంగా ఓ కార్యచరణ అమలు చేస్తోంది. తెలంగాణ కోర్ అర్బన్ రిజీయన్ పరిధిలో 1.26 లక్షల ఆటో రిక్షాలని క్రమంగా ఈవీలుగా మార్చాలి అని ఫోకస్ చేసింది. ఇది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సిటీలో ఉన్న అన్నీ ఆటోలు ఇలా ఈవీ ఆటోలుగా మారనున్నాయి. దీని వల్ల కర్బన ఉద్గారాలు వెలువడటం తగ్గుతుంది. లక్షలాది ఆటోలు నిత్యం ప్రయాణం చేయడం వల్ల పెద్ద ఎత్తున పొల్యుషన్ కూడా ఏర్పడుతోంది. దానికిచెక్ పెట్టనున్నారు.
ఈ ఆటోలు ఇక పై ఈవీలు మారనున్నాయి. అయితే ఇప్పటికే డిజీల్ పెట్రోల్, గ్యాస్ తో నడుస్తున్న ఈ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లను అమర్చనున్నారు. ఇదిప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ఆటోల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ కిట్లతో రెట్రోఫిట్ చేయనున్నారు. ఇక దీని కోసం 100 శాతం డబ్బు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రాబోయే బడ్జెట్ తో ఈ పథకం కోసం 200 కోట్లు కేటాయించనున్నారు.
ఈ కిట్ల కోసం ఆటో డ్రైవర్లు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టక్కర్లేదు. మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఒక్కో ఆటోకి సుమారు లక్షా 20 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. క్రమంగా ఇవన్నీ కూడా ఈవీలుగా మారనున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో నగరం మొత్తం ఈవీ బస్సులే నడవనున్నాయి. ఇక రానున్న రెండు మూడు నెలల్లో 150 కొత్త ఈవీ బస్సులు కూడా పరుగులు పెట్టనున్నాయి. రెండు సంవత్సరాల్లో 2500 బస్సులు రోడ్డెక్కించనుంది తెలంగాణ ప్రభుత్వం.

