ఈ ప్రపంచంలో నిత్యం అనేక వింతైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వింతైన ఘటనలతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ప్రతీ రోజు తెలుసుకుందాం.
1. అంతరిక్షంలో శబ్దం వినిపించదు. అక్కడ గాలి లేదు శబ్దం ప్రయాణించడానికి గాలి లేదా ఇతర మాధ్యమం అవసరం. అందుకే అక్కడ సౌండ్ వినిపించదు.
2.ఆక్టోపస్‌కి మూడు గుండెలు ఉంటాయి. రెండు గుండెలు రక్తం మొప్పలకు పంపుతాయి
ఒకటి శరీరానికి పంపుతుంది.
3.మన శరీరంలో సుమారు 30 ట్రిలియన్ కణాలు ఉంటే,దాదాపు అదే స్థాయిలో లేదా కొంచెం ఎక్కువగా బాక్టీరియా ఉంటాయి.
4. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడతాయి
నేలలోని ఫంగస్ నెట్‌వర్క్ ద్వారా సమాచారాన్ని పంపుకుంటాయి.
ఈ నెట్‌వర్క్‌ను శాస్త్రవేత్తలు Wood Wide Web అని పిలుస్తారు.
5..ప్రస్తుతం భూమిపై రోజుకి 24 గంటలు.
కానీ డైనోసార్ కాలంలో ఒక రోజు సుమారు 22 గంటలే ఉండేది, ఎందుకంటే భూమి అప్పట్లో వేగంగా తిరిగేది.
6..కొన్ని పరిస్థితుల్లో వేడి నీరు చల్లని నీటికంటే త్వరగా ఐస్‌గా మారుతుంది.
7. జిరాఫీకి 7 మెడ ఎముకలే ఉంటాయి మెడ ఎంత పొడుగు ఉన్నా మెడ భాగంలో ఏడు ఎముకలు ఉంటాయి
8.భూమి ఉపరితలం లో సుమారు 71% నీరు ఉంది.
అందులో ఎక్కువ భాగం Pacific Ocean వంటి సముద్రాల్లోనే ఉంటుంది.
9… భూమిపై అత్యంత పెద్ద పర్వతం సముద్రంలో ఉంది
మనకు తెలిసిన పెద్ద పర్వతం Mount Everest.
కానీ మొత్తం ఎత్తు చూస్తే Mauna Kea హవాయి లో పెద్దది. దాని చాలా భాగం సముద్రం లోపల ఉంటుంది
10.ప్రపంచంలో ప్రతి రోజు సుమారు 8 మిలియన్ మెరుపులు పడతాయి.

