ఉస్తాద్ భగత్ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలకు అన్నీ ఏర్పాట్లు కూడా మేకర్స్ పూర్తి చేశారు. ఇక సినిమాపై చిత్ర యూనిట్ కూడా ఎన్నో ఆశలుపెట్టుకుంది. ఓజీ సినిమాతో ఓ సూపర్ హిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్న పవన్, ఇప్పుడు తాజాగా ఉస్తాద్ సినిమాతో మరో లెవల్ చేరుకుంటారు అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఎక్కడా కూడా ఖర్చుకి వెనకడుగు వేయలదు. తనకు సినిమా కోసం 1000 మంది ఆర్టిస్టులు అంటే 1500 మందిని తీసుకోండి అని నాకు దైర్యం ఇచ్చారు, సపోర్ట్ చేశారు అని దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతల గురించి తెలియచేశారు.
మొత్తానికి విపరీతమైన బజ్ అయితే ఈ సినిమా పై కనిపిస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో హైలెట్ గా ఉండనుంది అంటున్నారు. ఫస్టాఫ్ లో కొన్ని డైలాగ్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయి అని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సెకండాఫ్ లో కూడా పవన్ కల్యాణ్ నటన అద్భుతంగా ఉందని ఎక్కడా కూడా సెన్సార్ కట్ లేకుండా వచ్చింది అంటున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో ఇద్దరు వర్క్ చేశారు. దేవీశ్రీ సాంగ్స్ కంపోజ్ చేశారు, ఇక తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇద్దరు వర్క్ చేయడంతో ఈ సినిమాపై ఇంకా హైప్ నెలకొంది.
పవన్ కల్యాణ్ ఈ సినిమాలో చాలా డేట్స్ కేటాయించారు. డిప్యూటీ సీఎంగా ఉంటూ తనకు టైమ్ దొరికిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పెట్టుకునేవారు. ఇంతలా పవన్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అయితే ధురందర్ 2 సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ ఉండటంతో ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయా అనే చర్చ జరుగుతోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో తెలుగులో ధురంధర్ సినిమా అసలు పోటికి లేదని, కలెక్షన్స్ పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అంటున్నారు. ధురంధర్ 2 నార్త్ లో మంచి కలెక్షన్స్ తీసుకువచ్చే దిశగా ఉంది. కాని తెలంగాణ ఏపీలో మాత్రం ఉస్తాధ్ భగత్ సింగ్ ప్రస్తుతం 72 శాతం షేర్ తో కనిపిస్తోంది అంటున్నారు. శ్రీలీల – రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో చాలా సర్ ఫ్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత అవి తెరపై కనిపించనున్నాయి.

