ఈ వారం సినిమా అభిమానులకి మంచి కిక్ ఇచ్చే పరిస్దితి కనిపిస్తోంది.. ఎందుకంటే ఓటీటీలో సినిమాల సందడితో పాటు ఈ వారం ఉగాది సందర్బంగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు సందడి చేయనున్నాయి. ఉగాదికి రెండు పెద్ద సినిమాలు రానుండటంతో ఇటు సినిమా అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. మొత్తానికి హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ ని గబ్బర్ సింగ్ ని మించి చూపిస్తారు అనేంతగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక ధురంధర్ 2 సినిమా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు.
ఇక ఓటీటీల్లో కూడా వరుస సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంటున్నాయి.. ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై భారీ విజయం సాధించిన బాలీవుడ్ యాక్షన్ చిత్రం బార్డర్ 2 మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇక పీకీ బ్లైండర్స్ సినిమా కూడాఎంతో ప్రాచుర్యం పొందింది ఈ సినిమా కూడా అదే రోజు మార్చి 20 న విడుదల చేస్తున్నారు ది ఇమ్మార్టల్ మ్యాన్ గా ఈ సినిమా వస్తోంది. అలాగే ఎ డిఫరెంట్ మ్యాన్ కూడా మార్చి 20 నుంచి ఓటీటీలో సందడి చేయనుంది.
ఇక మనకు తెలుగు సినిమాలు ఓటీటీలో ఏం రానున్నాయి అనేది చూస్తే, సీతా పయనం ఈ సినిమా సన్ నెక్ట్స్ లో విడుదల కానుంది. ఇక జటాధర సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమెజాన్ లో ఇన్విన్సిబుల్ సిరిస్ కూడా 18 మార్చిన విడుదల చేస్తున్నారు. అలాగే అమెజాన్ లో ది హౌస్ మెయిడ్ అనే హాలీవుడ్ చిత్రం కూడా రిలీజ్ అవ్వనుంది. ఇక జియో హాట్ స్టార్ లో చిరైయా అనే హిందీ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఓటీటీల్లో ఈ సినిమాలు అన్నీ కూడా సందడి చేసేందుకు ఈ ఉగాది వీక్ సిద్దంగా ఉన్నాయి.

