ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సినిమాకి ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఓజీ రికార్డులు కూడా దాటే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక ప్రీమియర్స్ టికెట్ ధర ఎంత ఉన్నా కొనేందుకు సిద్దం అవుతున్నారు ఫ్యాన్స్ . తాజాగా ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో కలెక్షన్స్ ఇప్పటి వరకూ చూసుకుంటే దాదాపు 2 మిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ రేంజ్ లో బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓజీ కలెక్షన్స్ రెండు తెలుగు స్టేట్స్ దాటే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు. అయితే ధురంధర్ సినిమా విడుదల కూడా ఇదే రోజు ఉండంతో సినిమా కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం పడుతుందా అని అందరూ భావించారు. అయితే బుకింగ్స్ విషయంలో తెలుగు స్టేట్స్ లో ధురంధర్ సినిమాని దాటేసింది. ఇప్పటికే 76 శాతం ఆక్యుపెన్సీ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తోంది.
ఇక ధురంధర్ సినిమాకి నార్త్ లో మంచి హైప్ ఉంది. అక్కడ కలెక్షన్స్ కేక పుట్టించే అవకాశం ఉంది. ఇక్కడ తెలుగు స్టేట్స్ లో దాదాపు ఈ సినిమాకి 23 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇది కూడా ఓవర్సీస్ మార్కెట్ లో ఆయనకు కలిసి వచ్చింది. ఇక ఉగాదికి రిలీజ్ ఉండటం కూడా ఈ సినిమాకి మరో బూస్ట్ అయింది. హరీష్ శంకర్ సినిమా కావడం మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కించడం బయ్యర్లు కూడా ఈ సినిమా కొనేందుకు పోటీపడ్డారు. నార్త్ అమెరికాలో ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వన్ మిలియన్ మార్క్ అడ్వాన్స్ బుకింగ్స్ దాటింది అని తెలుస్తోంది, ప్రస్తుతం ఓవర్సీస్ రిపోర్ట్ ప్రకారం.
ప్రీమియర్స్ 18 వ తేది రాత్రి నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ చాలా స్లోగా మొదలయ్యి వేగంగా రీచ్ అయ్యాయి.

