సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కంటెంట్ ఉంటేనే నడుస్తుంది అనేది, ఇటీవల నిరూపితం అవుతోంది. గతంలో సినిమా ఎలా ఉన్నా నాలుగు ఐదు సార్లు అభిమానులు చూసేవారు. ఇక ఇప్పుడు అభిమానుల అభిరుచి మారింది. ఒక్క సారిచూసి నచ్చకపోతే సైలెంట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది, ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు ఇప్పుడు హిట్ టాక్ వస్తే, రెండు వారాలు ఆడటం కష్టంగా ఉంది. ఇటీవల ప్రభాస్ రాజాసాబ్ చూశాం, ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో, అయినా సినిమా నచ్చలేదు. దర్శకుడిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండోవారం చాలా చోట్ల సినిమా తీసేశారు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్దితి అలాగే ఉంది. విడుదలకు మంచి హైప్ ఉంటున్న సినిమాలు, బొమ్మ పడిన రెండు మూడు గంటల్లో యూఎస్ రివ్యూ నుంచి తెలుగు రాష్ట్రాల రివ్యూలు వచ్చేసరికి డౌన్ అయిపోతున్నాయి.ముందు అభిమానుల నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఇక్కడ అభిమానుల రెస్పాన్స్ కాదు, సినిమా అభిమానుల రెస్పాన్స్ ముఖ్యం.
వీరి నుంచి పవన్ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు . ఫ్యాన్స్ మాత్రమే కాలర్ ఎగరేశారు అది కూడా కొంత మేర మాత్రమే. ఇక సీడెడ్ అస్సలు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఓ పక్క గోదావరి జిల్లాలు నైజాం హైదరాబాద్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. విశాఖ ఉత్తరాంధ్రా కూడా పెద్దగా ప్రభావం లేదు. తొలి రోజు 80 కోట్ల పైనే వసూళ్లు వస్తాయి అని అనుకున్నారు.
కానీ నాలుగు రోజులు అయినా 100 కోట్ల మార్క్ చేరుకోలేదు అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.
ఓవర్సీస్ లో అయితే పరిస్దితి మరీ దారుణంగా ఉంది. అయితే కంటెంట్ లేని సినిమాలు ఆ హీరో అభిమానులు కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు అనేది స్పష్టం అవుతంది. ఓపక్క ధురంధర్ 2 సినిమా పెద్దగా తెలుగులో ప్రమోషన్ కూడా చేయలేదు కానీ వసూళ్లు మాత్రం కంటెంట్ తో దూసుకుపోతున్నాయి.రోజుకి తెలుగు వెర్షన్ 5 కోట్ల పైనే తీసుకువస్తుంది. మల్టిప్లెక్సుల్లో దాదాపు 80 శాతం టికెట్ సేల్ అవుతున్నాయి. సో మొత్తానికి దర్శకులు హీరోలు మారాలి అనేది ఈ రిజల్ట్ చెబుతోంది. కొత్త కంటెంట్ ఇప్పటి యూత్ కోరుకుంటున్నారు. అదే జోరుతో తెలుగు దర్శకులు హీరోలు వెళితే మన సినిమా పరిశ్రమ కూడా కళకళలాడుతుంది అంటున్నారు విశ్లేషకులు.

