మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా, ఆయన సందడి అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ఇమేజ్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. చాలా చక్కగా చలాకీగా యాక్టీవ్ గా మాట్లాడతారు 70 ఏళ్ల వయసుల కూడా. మల్లారెడ్డి కుటుంబం కూడా ఆయన ఏం చెబితే అది చేస్తుంది. అయితే తాజాగా మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతనిధులతో ముచ్చటించారు, పలు కీలక కామెంట్లు చేశారు. అంతేకాదు తన మనసులో మాట కూడా బయటపెట్టారు.
నేను రాజకీయాల్లో ఎలాగో ముఖ్యమంత్రి కాలేను, అయితే రీల్ లైఫ్ లో అయినా తాను ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని అనుకుంటున్నానని, తన మనసులో మాట బయటపెట్టారు మల్లారెడ్డి. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర వస్తే కచ్చితంగా చేస్తా అని తెలిపారు మల్లన్న.
ఇక రెడ్లలో సీఎం అయ్యే స్ధాయి పేరు రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని గతంలో తాను చెప్పాను. ఒక రకంగా రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే అని తనదైన శైలిలో మాట్లాడారు మల్లారెడ్డి. రాజకీయాల్లో విమర్శలు కామన్, కానీ మేమ ఇద్దరం అన్నదమ్ములమని స్పష్టం చేశారు మల్లారెడ్డి.
ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో తనకు విలన్ పాత్ర చేయమని ఆఫర్ వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వచ్చి కోరారు. అయితే తనకు విలన్ పాత్ర ఇష్టం లేదని చెప్పేశాను. ఆయన సరే అన్నారు. నాకు విలన్ వేషం ఇష్టం లేదు సీఎం వేషం వస్తే వేయడానికి సిద్దంగా ఉన్నాను అని అన్నారు మల్లారెడ్డి.

