విజయ్ గెలుపుకి – స్టాలిన్ ఓటమికి కారణాలు ఇవే
తమిళనాడులో ఇప్పుడు అందరూ విజిల్ వేస్తున్నారు. విజయ్ పార్టీ 108 స్ధానాల్లో అద్బుత విజయం సాధించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు విజయ్. ఇక 10 సీట్లు కావాల్సి ఉంది దీని కోసం మంతనాలు జరుపుతున్నారు. అయితే ఎంజీఆర్ ఆ తర్వాత విజయ్ ఇంత తక్కువ సమయంలో ఇంతలా ప్రజల మనసు గెలిచి విజయం సాధించిన నాయకులుగా నిలిచారు.
దాదాపు 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయ పార్టీల చేతిలో ఉన్న తమిళనాడు ఇప్పుడు విజయ్ పాలనతో ముందుకు సాగనుంది. తొలిసారి పోటీ చేసి విజయ్ ఇంతటి విజయం సాధిస్తారు అని ఎవరూ కూడా ఊహించలేదు. ఇది సైలెంట్ తుఫాన్ అనే చెప్పాలి. ఇక స్టాలిన్ కూడా ఓటమి పాలవ్వడం డీఎంకే శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
కొళత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ 8,795 ఓట్ల తేడాతో ఓటమిచెందారు. సో డీఎంకే అన్నాడీఎంకే మధ్య వైరం పోయింది ఇప్పుడు విజయ్ వర్సెస్ రెండు పార్టీలు అనే చెప్పుకోవాలి.
** ఈ ఎన్నికల్లో డీఎంకే మైనస్ ఏమిటి? అలాగే విజయ్ గెలుపుకి ప్రధాన కారణాలు ఏమిటి అనేది చూద్దాం **
1. తమిళనాడులో సినిమా నటుడు స్ధాపించే కొత్త రాజకీయ పార్టీ కోసం చాలా మంది ఎదురుచూశారు. దాదాపు 20 ఏళ్లుగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే మళ్లీ కొత్త ఎరా వస్తుంది అని చూసిన వారికి విజయ్ ఓ టార్చ్ బేరర్ అయ్యాడు.
కరుణానిది, స్టాలిన్, జయలలిత, వీరందరిని చూసిన జనం, సినిమాల నుంచి ఎవరు వస్తారా అని చూశారు. విజయ్ కాంత్ రాణించలేదు, ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు, ఇక కమల్ వచ్చినా సక్సస్ అవ్వలేదు, మాస్ లో మంచి ఫేమ్ ఉన్న విజయ్ కు ఇది బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. అలాగే విజయ్ అవినీతికి దూరం, పైగా తన దగ్గర ఉన్న కోట్ల రూపాయలు జనాలకు ఖర్చు చేశాడు ఇది ఆయనపై నమ్మకం కలిగించింది.
2. ఇక విజయ్ పై భార్య ఆరోపణలు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు విమర్శలు, ఇవన్నీ వచ్చినా ఆ సమస్యలు నావి, వాటిని వీటిలో కలపకండి అని సభల్లో చెప్పడం, ఎవరి జీవితానికి అయినా పర్సనల్ లైఫ్ ఉంటుంది, దానిని దీనిని కలపడం కరెక్ట్ కాదు అనే భావన అభిమానుల్లో ప్రజల్లో కూడా కలిగింది.
3. ఇక డీఎంకే పై వ్యతిరేకత బాగాపెరిగింది. పది సంవత్సరాలు అధికారం కోసం చూసిన స్టాలిన్ 2021లో గెలుపొందారు . అయితే లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఇక మహిళలపై దాడులు జరగడం, ఇవన్నీ కూడా విజయ్ పై నమ్మకం పెంచాయి స్టాలిన్ పై నమ్మకం తగ్గించాయి.
4. ఇక టీవీకే కూడా తమ ప్రచారం లో అవినీతి నిర్మూలన, మంచి పాలన, తమిళనాడు అభివృద్ది అంటూ పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లింది . ఇది కూడా బాగా కలిసి వచ్చింది ప్రజల్లో నమ్మకం కలిగింది.
5. డీఎంకే అసలు విజయ్ ని పట్టించుకోలేదు, తమ సొంత సర్వేలు పోల్ సర్వేలు నమ్మి, స్టాలిన్ విజయ్ ని చాలా తక్కువ అంచనా వేశారు. అందుకే విజయ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుని విజయం పొందారు. ఎప్పుడూ కేంద్రం పై అన్నాడీఎంకే పై విమర్శలు చేసిన స్టాలిన్, విజయ్ పై పెద్దగా రాజకీయ విమర్శలు చేయలేదు. ఇది పార్టీకి పెద్ద మైనస్ అయింది.
6 ఇక కరుణానిధి తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ వచ్చాడు, ఇప్పుడు ఆయన కుమారుడు ఉథయనిధి వస్తున్నాడు. డీఎంకే నేతలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి, పైగా విజయ్ సొంత చరిష్మాతో రావడంతో ప్రజలు ఆదరించారు.
7. ఇక రాష్ట్ర బడ్జెట్ అంచనాలు వేసుకుని తన మేనిఫెస్టో ప్రకటించారు విజయ్. ఇది మేధావులకి ఆర్దిక నిపుణులకి యువతకి ఉద్యోగులకి నచ్చింది. ఇది కూడా విజయ్ గెలుపుకి ప్రధాన కారణం అయింది.

