HomeFinanceAI ఎఫెక్ట్ 30 వేల ఉద్యోగాల కోత - టెక్ మహీంద్ర క్లారిటీ

AI ఎఫెక్ట్ 30 వేల ఉద్యోగాల కోత – టెక్ మహీంద్ర క్లారిటీ

ఏ ఏడాది జ‌న‌వ‌రి నుంచి టెక్నాల‌జీ కంపెనీలు ఉద్యోగుల‌కి షాకిస్తున్నాయి. ఎమ్ ఎన్ సీ కంపెనీలు భారీగా ఉద్యోగుల సంఖ్య‌ని త‌గ్గిస్తున్నాయి. అమెజాన్ కూడా ఇటీవ‌ల లే ఆఫ్స్ ప్ర‌క‌టించింది. ఇలాంటి వేళ మ‌న దేశీయ కంపెనీల చేతిలో కూడా కొత్త ప్రాజెక్టులు లేక‌పోవ‌డంతో బెంచ్ పై ఉన్న రెండున్న‌ర ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోతార‌నే వార్త‌లు టెక్ ప్ర‌పంచంలో వినిపించాయి. ముఖ్యంగా ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్, దేశాల మ‌ధ్య యుద్ద ప్ర‌భావం వ‌ల్ల కంపెనీల‌పై కూడా ఇది బారీ ఎఫెక్ట్ ప‌డుతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కొల్పోతున్నారు.

ఇక ఏఐ ఎఫెక్ట్ కూడా భారీగా ఉద్యోగుల‌పై ప్ర‌భావం చూపిస్తోంది. కోడింగ్ పై వ‌ర్క్ చేసే ఉద్యోగుల‌కి రానున్న రోజులు మ‌రింత భ‌యంక‌రంగా ఉంటాయి అని తెలుస్తోంది. ఫైనాన్స్ రంగంలో హెల్త్ కేర్ రంగంలో ఇది మ‌రింత ప్ర‌భావం చూపిస్తుంది అంటున్నారు. ఇలాంటి వేళ టెక్ మ‌హీంద్రా కూడా త‌మ కంపెనీ నుంచి 30 వేల మంది ఉద్యోగుల‌ని తొల‌గిస్తుంది అనే వార్త‌లు గ‌డిచిన వారం రోజులుగా టెక్ ప్ర‌పంచంలో వినిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగులు కూడా ఈ వార్త‌లు విని షాక్ అయ్యారు. అయితే ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం అవ్వ‌డం పై వెంట‌నే కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

ఈ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఎలాంటి వాస్త‌వం లేద‌ని స్టాక్ ఎక్చ్సెంజ్ కు ఇచ్చిన రిపోర్టులో స్ప‌ష్టం చేసింది. ఇది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే అని వాస్త‌వాన్ని తెలిపింది. ఈ వార్త ఉద్యోగుల‌కి కూడా కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది. అంతేకాకుండా మ‌దుప‌రుల‌కి అంటే ఇన్వెస్ట‌ర్ల‌కు కూడా ఓ క్లారిటీ ఇచ్చిన‌ట్లు అయింది. అయితే ఈ పుకారు పుట్ట‌డానికి ఓ కార‌ణం కూడా ఉంది. టెక్ మహీంద్రా కంపెనీ ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుంది. దీని కోసం టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ తో క‌లిసి ప‌నిచేస్తోంది. ఇక ఇది అమ‌లు చేస్తే కంపెనీ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గించుకుంటుందని లేఆఫ్స్ చేస్తుంది అని కొంద‌రు ప్ర‌చారం చేశారు. కానీ ఇది వాస్త‌వం కాద‌ని కంపెనీ తెలిపింది. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్ మ‌హీంద్రా కంపెనీలో 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉద్యోగులు వ‌ర్క్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments