మిడిల్ ఈస్ట్ లో యుద్దం రావడంతో మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్యాస్ కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి గ్యాస్ ని కొనుగోలు చేసింది భారత్.. మరో 15 రోజుల్లో మన దేశానికి ఈ గ్యాస్ రానుంది. అప్పటి వరకూ ఈ కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా హైదరాబాద్ లో గ్యాస్ లేకపోవడంతో హోటల్స్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. నగరంలో రూమ్స్ తీసుకుని ముగ్గురు నలుగురు ఉంటున్న బ్యాచిలర్స్ కూడా, గ్యాస్ లేకపోవడంతో రైస్ వండుకుని కూరలు మెస్ నుంచి కర్రీ పాయింట్ల నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మెస్ లు కర్రీ పాయింట్లు కూడా క్లోజ్ అవుతున్నాయి. ఇక హాస్టల్స్ అయితే ఫుడ్ పెట్టలేక మూసివేస్తున్నారు. మరికొందరు ఒంటిపూట మాత్రమే ఫుడ్ అని తెలియచేస్తున్నారు.
నగరంలో పెయింగ్ హస్టల్స్ లో నాలుగు ఐదు రోజులుగా ఉదయం టిఫిన్ లేకుండా ఓన్లీ రైస్ పికిల్ పెడుతున్నారని కొందరు విద్యార్దులు తెలియచేస్తున్నారు. అయితే గ్యాస్ లేనిదే తాము ఏం చేస్తామని హస్టల్ యజమానాలు వాపోతున్నారు. బయట సిలిండర్లు దొరకని పరిస్దితి దీంతో హైదరాబాద్ నగరంలో లక్షలాది మందిపై ఇది ఎఫెక్ట్ పడింది. ఇక హస్టల్ లో ఫుడ్ లేకపోవడంతో బయట ఫుడ్ తిందామన్నా 100 కి 80 శాతం హోటల్స్ క్లోజ్ అయ్యాయి. ఉన్నా కూడా ప్లేట్ ఇడ్డీ 50 రూపాయలు దోశ బోండా 60 రూపాయలకు అమ్ముతున్నారు. గ్యాస్ దొరక్కపోవడంతో రేట్లు పెంచవలసి వచ్చిందని చెబుతున్నారు.
హస్టల్ లో ఉండే స్టూడెంట్స్ ఓపక్క ఫుడ్ లేకపోవడంతో కొన్ని రోజులు ఇంటికి వెళ్లడం బెటర్ అని ఇంటికి వెళ్లిపోతున్నారు. దాదాపు 20 వేల మంది స్టూడెంట్స్ కోచింగ్ కు వచ్చిన వారు ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ విడిచి వెళ్లారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. గ్యాస్ ఇబ్బందితో సొంత ఊర్లకు వెళ్లారు. ఇక ఇండక్షన్ స్టవ్ కరెంట్ తో నడిచే వస్తువులకి ఫుల్ డిమాండ్ వచ్చింది. స్టీల్ పాత్రలు కూడా భారీగా కొనుగోళ్లు పెరిగాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉండటంతో ఇండక్షన్ స్టవ్స్ కూడా ఎక్కడా దొరకని పరిస్దితి వచ్చింది.
మొత్తం హైదరాబాద్ లో 11 వేల హాస్టల్ ఉన్నాయి. అమీర్ పేట, ఎస్సార్ నగర్, పంజాగుట్, దిల్ సుఖ నగర్, ఇలా 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉద్యోగులు ఉన్నారు. సగానికి సగం హస్టల్స్ ఇలా కఠిన నిబంధనలు పెడుతున్నాయి. ఇక ఉదయం ఉప్మా మధ్యాహ్నం పికిల్ రసం పప్పు. రాత్రి అన్నం పెరుగు కూర పెడతామని హాస్టల్స్ నిర్వహకులు చెబుతున్నారు. ఇక భాగ్యనగరంలో రోజు వారి వర్క్ చేసుకునేవారికి ఉపాధి దూరం అయింది. హోటల్స్ రెస్టారెంట్లలో పనిచేసేవారికి పది రోజులుగా ఉపాధి లేదు.
ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే కొందరు బ్లాక్ మార్కెట్ దందా కూడా చేస్తున్నారు. గతంలో రూ.1800కి ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 3500 నుంచి 4000 వరకూ ధర చెబుతున్నారని, అయినా కూడా ఒకటి లేదా రెండు ఇస్తామంటున్నారని అంత డిమాండ్ ఉందని తెలియచేస్తున్నారు. ఇక హోటల్స్ రెస్టారెంట్లు క్లోజ్ ఉండటంతో బిర్యానీ ధరలు కూడా 20 శాతం పెంచేశారు కొందరు యజమానులు. ఎక్కడా బిర్యానీ దొరక్కపోవడంతో ఈ ధరలు పెరిగాయి. ఇక స్వీగ్గి జొమాటో వంటి సంస్ధల్లో డెలివరీ బాయ్స్ రోజుకి నాలుగు ఐదు డెలవరీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇక హైదరాబాద్ సిటీలో కరెంట్ కుక్కర్లు ఇండక్షన్ స్టవ్ ల వాడకంతో రోజుకి 3300 మెగా వాట్లకు మించని వాడకం ఏకంగా 3500 మెగా వాట్లు దాటేసింది.
ఇప్పటికే ఇంటికి ఉపయోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను కమర్షియల్ గా ఉపయోగిస్తున్న వారిని గుర్తించి సిటీలో 250 కి పైగా కేసులు నమోదు చేశారు అధికారులు. ఆ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. గృహ ఎల్పీజీ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడద్దని అధికారులు తెలియచేస్తున్నారు. ఇక ఆన్ లైన్ బుకింగ్ చేద్దామన్నా కస్టమర్లకు అవ్వడం లేదు.సర్వర్ బీజీ వస్తోంది.
ఇక గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులు కూడా మూసివేస్తున్న పరిస్దితి. ఎందుకంటే కస్టమర్లు ఉదయం ఆరు గంటలకు పెద్ద ఎత్తున గ్యాస్ బుకింగ్ కోసం క్యూ కడుతున్నారు. అయితే ఆఫీసుల్లో కూడా సర్వీస్ బీజీ అని పోర్టర్ చూపించడంతో చివరకు ఆఫీస్ క్లోజ్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇంటి అవసరాలకు గ్యాస్ సరఫరా చేస్తున్నారు.కేవలం బుకింగ్ అయిన వారికి మాత్రమే డెలివరీ జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు మాత్రం సిలిండర్లు ఇవ్వడం లేదు.

