HomeFinanceఫేస్ బుక్ ఉద్యోగుల‌కి బ్యాడ్ న్యూస్ - ఏఐ ఎఫెక్ట్

ఫేస్ బుక్ ఉద్యోగుల‌కి బ్యాడ్ న్యూస్ – ఏఐ ఎఫెక్ట్

మ‌నిషి క‌నిపెట్టిన ఏఐ టెక్నాల‌జీ మ‌న‌కే చేటు తెస్తోంది. ఆ టూల్స్ డ‌వ‌ల‌ప్ చేసిన వారే చివ‌ర‌కు త‌మ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా లే ఆఫ్స్ ఎంత భ‌యంక‌రంగా ఉన్నాయో మ‌నం చూస్తున్నాం. ఏఐ కొత్త ఆశ‌లు ఎలా ఉన్నా చాలా మంది ఉద్యోగుల జీవితాలు నాశ‌నం అవుతున్నాయి. ఏఐ వ‌ల్ల 30 ఏళ్ల లోపు వ‌య‌సున్న 30 మంది ప్ర‌పంచ వ్యాప్తంగా బిలియ‌నీర్లుగా మారారు. కానీ ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా టెక్ దిగ్గ‌జ కంపెనీలు అన్నీ ప్ర‌తీ రూపాయి డాల‌ర్ సేవ్ చేయ‌డానికి చూస్తున్నాయి. ఏ డిపార్ట్ మెంట్లో ఉద్యోగులు ఎక్కువ ఉంటే అక్క‌డ ఏఐ అప్ డేట్ చేస్తున్నారు.

అక్క‌డ హ్యూమ‌న్ వ‌ర్క్ త‌గ్గుతోంది. ఆ పనిని ఏఐ చేసుకుపోతోంది. అమెజాన్ కూడా ఇదే ఆలోచ‌న చేసింది. 150 మంది చేసే ఓ వ‌ర్క్ ఒక ఏఐ చేయ‌డంతో లే ఆఫ్స్ ప్ర‌క‌టించింది. తాజాగా పెద్ద పెద్ద ఎమ్ ఎమ్ సీలు ఉద్యోగుల విష‌యంలో ఎలాంటి ఆలోచ‌న లేకుండా బ‌య‌ట‌కు పంపుతున్నాయి.

హైక్ విష‌యం గురించి ఉద్యోగులు మ‌ర్చిపోతున్నారు. త‌మ‌కు ఉద్యోగం ఉంటే చాలు అనే ఆలోచ‌న‌కు వ‌చ్చేశారు. ఇక తాజాగా ఫేస్ బుక్ అధినేత జూక‌ర్ బ‌ర్గ్ కూడా ఉద్యోగుల‌ని తీసివేయ‌డానికి సిద్దం అవుతున్నారు. మెటా భారీ మార్పులు చేస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఉద్యోగం నుంచి తొల‌గించ‌నుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. సుమారు 79 వేల మంది ఉద్యోగులు మెటాలో ప‌నిచేస్తున్నారు. అందులో 16 వేల మందిని కంపెనీ బ‌య‌ట‌కు పంప‌నుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబ‌డులు పెడుతోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఈ విష‌యంలో చాలా దూకుడుగా ఉన్నారు. సీనియ‌ర్లు జూనియ‌ర్లు బెంచ్ పై ఉన్న వారు అనే తేడా లేదు. సుమారు 16 వేల మంది ఉద్యోగాలు మ‌రో మూడు నెల‌ల్లో కోల్పోనున్నారు అనేది ఇప్పుడు డేంజ‌ర్ బెల్ మోగిస్తోంది.

ఓ ప‌క్క ఏఐలో పెట్టుబ‌డులు పెట్టి కంపెనీ ఖ‌ర్చులు త‌గ్గించాలి అని చూస్తోంది. ఇటీవ‌ల సూప‌ర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కోసం బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. అలాగే స్కేల్ ఏఐ స్టార్ట్ అప్ కొనుగోలు చేసింది. వీటి వాడ‌కంతో కంపెనీ ఇంత మంది ఉద్యోగులు అవ‌స‌రం లేద‌ని భావిస్తోంది. 2028 కి ఏఐలో 600 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఇన్వెస్ట్ మెంట్ చేయాల‌ని చూస్తోంది కంపెనీ.

10 టీమ్స్ క‌లిసి చేసే ప‌ని ఒక్క ఏఐ పూర్తి చేస్తోంద‌ని. ఇది పెద్ద మార్పు తీసుకురానుంద‌ని తెలియ‌చేశారు. కంపెనీలో చాలా మంది సీనియ‌ర్లు కూడా ఈ ఉద్యోగాలు కోల్పోనున్నారు. 2022 లో మెటా 11 వేల మందిని తొలగించింది. త‌ర్వాత చాలా కాలం లేఆఫ్స్ ఆపింది. ఆ నెక్ట్ ఇయ‌ర్ 10 వేల మందికి ఉద్వాస‌న ప‌లికింది. తాజాగా 16000 మంది అంటే ఇది టెక్ ప్రపంచంలో పెద్ద చ‌ర్చ‌కు కార‌ణం అవుతోంది. అయితే కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కూ దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments