Homeతెలంగాణస్డూడెంట్స్ కి తెలంగాణ స‌ర్కారు గుడ్ న్యూస్ - నెల‌కి 2500

స్డూడెంట్స్ కి తెలంగాణ స‌ర్కారు గుడ్ న్యూస్ – నెల‌కి 2500

తెలంగాణ స్టేట్ లో రేవంత్ రెడ్డి స‌ర్కారు కీల‌క నిర్ణ‌యాల‌తో స‌రికొత్త ప‌థ‌కాల‌తో పేద ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతోంది. తాజాగా తెలంగాణ‌లో స‌ర్కారు స్కూల్లో కాలేజీలో చ‌దువుకునే స్టూడెంట్స్ కి మ‌రింత ప్రొత్సాహం అందించే దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. కొంత‌మంది కాలేజీలు దూరం ఉండ‌టంతో స‌రైన ర‌వాణా స‌దుపాయం లేక‌పోవ‌డం వ‌ల్ల‌ చ‌దువుకి దూరం అవుతున్నారు. అయితే ప్ర‌తిభ ఉండి చ‌దువుకు దూరం అవుతున్న వారికి ఆర్దికంగా సాయం అందించే దిశ‌గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే విద్యాశాఖ రెండు ప‌థ‌కాల‌కు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇవి కాని అమ‌లు అయితే వేలాది మంది విద్యార్దుల‌కి ఫ‌లితం ద‌క్కనుంది.

ఎవ‌రైతే ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్నారో ఆ విద్యార్దుల కోసం కొత్త ప్ర‌తిపాద‌న చేస్తున్నారు. ఎవ‌రైనా దివ్యాంగ విద్యార్దులు ఉన్నా ట్రాన్స్ జెండ‌ర్స్ ఉన్నా, స‌మాజంలో బాగా వెనుక‌బ‌డి ఉన్న వారు, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారికి ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించి స్కూట‌ర్లు ఉచితంగా అందివ్వ‌నున్నారు. ఇలా వీరికి స్కూట‌ర్లు ఇవ్వ‌డం ద్వారా వీరికి చ‌దువుకి ఆటంకం క‌ల‌గ‌దు. అందుకే వీరిని ప్ర‌త్యేకంగా గుర్తించి ఈ స్కూట‌ర్లు ఇవ్వాలి అని ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది.

ఇక ఎవ‌రైతే ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌లో ప్ర‌భుత్వ స్కూల్లో చ‌దువుకుంటున్న స్టూడెంట్ ఉంటారో. వారికి ఆర్దికంగా అండ‌గా ఉండేలా ప్ర‌తీ ఏడాది మెరిట్ సాధించిన స్టూడెంట్స్ కి, ఏడాదికి 2500 చొప్పున వారి ఖాతాలో వేయ‌నున్నారు. ఇలా రాష్ట్ర‌వ్యాప్తంగా 40 వేల మంది ఉండ‌వ‌చ్చు అని అంచ‌నాలు. ఇలా నేరుగా ఆ స్టూడెంట్స్ అకౌంట్లో న‌గ‌దు ప‌డుతుంది కాబ‌ట్టి వారికి ఉన్న‌త చ‌దువుల‌కి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్రైవేట్ కంటే ప్ర‌భుత్వ‌ స్కూల్లు, కాలేజీలు, ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్లు పెరిగి పేద‌ల‌కు అంద‌రికి నాణ్య‌మైన ఉచిత విద్య అందించాలి అని రేవంత్ రెడ్డి స‌ర్కారు భావిస్తోంది. ఈ నిర్ణ‌యాల ప‌ట్ల‌ చాలా మంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా ఈ నిర్ణ‌యం వేల మందికి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments