Homeతెలంగాణపెళ్లికి నో చెప్పింద‌ని అమ్మాయికి HIV ఇంజెక్షన్ - దారుణ ఘ‌ట‌న

పెళ్లికి నో చెప్పింద‌ని అమ్మాయికి HIV ఇంజెక్షన్ – దారుణ ఘ‌ట‌న

నిజ జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లే సినిమాల్లో చూపిస్తారు అని మ‌నం అనుకునేవాళ్లం. కానీ సినిమాలో చూపించే ఘ‌ట‌నలు కూడా ఇటీవ‌ల కొన్ని జ‌రుగుతున్నాయి. సినిమాల నుంచి సొసైటీ మంచి తీసుకుంటోంది అలాగే చెడు తీసుకుంటోంది. కొంద‌రు అత్యంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు.హైద‌రాబాద్ శివారులోని పోచారంలో ఓ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.త‌న‌ను పెళ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రించింది అని ఆ అమ్మాయికి హెచ్ ఐ వీ ర‌క్తాన్ని ఇంజెక్ష‌న్ చేశాడు దుర్మార్గుడు. అస‌లు ఏం జ‌రిగింది అనేది చూస్తే.

పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి అక్క‌డ ఓ యువ‌తితో ఇటీవ‌ల పెళ్లి కుదిరింది. ఇప్పటికే పెళ్లి షాపింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి.ఇక మ‌రో రెండు వారాల్లో పెళ్లి అన‌గా అమ్మాయి కుటుంబం ఈ సంబంధం వ‌ద్ద‌ని చెప్పింది. ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉంద‌నే విష‌యం అమ్మాయి కుటుంబ స‌భ్యుల‌కి తెలిసింది. ఈ పెళ్లి ఇక వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు , దీంతో మ‌నోహార్ ఆమె పై క‌క్ష పెంచుకున్నాడు. అమ్మాయి కుటుంబ స‌భ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లి మా అమ్మాయి జీవితం నాశ‌నం చేయ‌లేము అని చెప్ప‌డంతో ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది..

ఇక ఊర్లో ప‌రువు పోయింది అని మ‌నోహ‌ర్ ఆమెపై క‌క్ష పెంచుకున్నాడు. త‌న పెళ్లి ర‌ద్దు అవ్వ‌డానికి ఆ అమ్మాయి కార‌ణం అని భావించి ఈనెల 11న అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఒక‌సారి మాట్లాడాలి అని ఆమెని కోరాడు. ఆమె మాట్లాడ‌లేదు చివ‌ర‌కు ఇద్ద‌రికి గొడ‌వ జ‌రిగింది. న‌న్ను ఎందుకు పెళ్లి చేసుకోవు చేసుకో అని ఆమెని బెదిరించాడు. ఆమె అత‌నికి దూరంగా జ‌రిగి పెళ్లి చేసుకోను అని చెప్పింది. అప్ప‌టికే హెచ్ ఐవీ ర‌క్తం క‌లిగిన సిరంజీని తీసి ఆమెకి బ‌ల‌వంతంగా ఎక్కించేశాడు. ఆమె అరుపులు అర‌వ‌డంతో అంద‌రూ వ‌చ్చి అత‌న్ని ప‌ట్టుకున్నారు. చివ‌ర‌కు పోలీసుల‌కి అప్ప‌గించారు. స్దానికులు ఆమెని వెంట‌నే హ‌స్పిట‌ల్ లో చేర్పించారు.

అయితే ఆ ఇంజెక్ష‌న్ ఎక్కించ‌డం వ‌ల్ల ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. త‌న‌కు ఈ జ‌బ్బు ఉంద‌ని పెళ్లి వ‌ద్దంది, త‌నికి ఈ జ‌బ్బు ఉంటే పెళ్లి చేసుకుంటుంది క‌దా అని దుర్మార్గ‌పు ఆలోచ‌న‌తో అత‌ను ఈ ప‌ని చేశాడు. ఇలాంటి వ్య‌క్తిని ఇప్పుడు వ‌దిలేస్తే వ‌చ్చే రోజుల్లో ఇంకా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి. మ‌ళ్లీ ఇలా ఎవ‌రూ చేయ‌కూడ‌దు అంటే అత‌నికి త‌క్ష‌ణ‌మే ఉరిశిక్ష వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు సామాన్య ప్ర‌జ‌లు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments